Centuries-Old Temple Find In Odisha's Mahanadi River మహానదిలో బయటపడ్డ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం

500 year old temple submerged in odisha river spotted after 11 years

ancient temple submerged, Centuries-Old Temple submerged, Submerged Odisha temple, Temple submerged in Mahanadi River, INTACH, Nayagarh, Lord Gopinath, Lord Vishnu, 500 years old Temple

A temple believed to be 500 years old has been found in the Mahanadi River in Odisha. The temple was submerged during floods in 1933, say researchers. With the river changing its course due to flooding over a hundred years ago, an entire village and the temple were submerged at Nayagarh.

మహానదిలో బయటపడ్డ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం

Posted: 06/17/2020 10:40 PM IST
500 year old temple submerged in odisha river spotted after 11 years

ఐదు శతాబ్దాల క్రితం నాటి చారిత్రాత్మకమైన దేవాలయం ఒడిశాలోని మహానదిలో బయటపడింది. శతాబ్దాల క్రితం భక్తుల తాకిడిని చవిచూసిన పురాతన దేవాలయం.. 1933లో వచ్చిన వరదల్లో మునిగిపోయిన పుణ్యక్షేత్రం ఇన్నాళ్లకు మళ్లీ బయటపడింది. 90 ఏళ్ల క్రితం భారీ వరదల వల్ల మహానది తన దిశను మార్చుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో నయాఘర్ సమీపంలో ఉన్న ఆలయంతో పాటు మొత్తం గ్రామం మునిగిపోయింది. ఆలయానికి సంబంధించి పైభాగం కొంచెం బయటపడడంతో... గుడిని గుర్తించినట్టు 'ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్టీఏసీహెచ్)' కు చెందిన పురావస్తు సర్వే బృందం తెలిపింది.

'ఈ దేవాలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. 450 నుంచి 500 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహాన్ని మరో ఆలయానికి తరలించారు. మహానది లోయ ప్రాంతంపై మేము ప్రాజెక్ట్, డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ ఆలయం గురించి వెతికాం. ఆలయం పైభాగం కనిపిస్తోందంటూ వారం క్రితం మాకు సమాచారం వచ్చింది' అని ఐఎన్టీఏసీహెచ్ చీఫ్ అనిల్ కుమార్ ధీర్ తెలిపారు. ఈ ఆలయంలోని మూలవిరాటు విష్ణు అవతారమైన శ్రీకృష్ణ భగవానుడిదై ఉంటుందని అనిల్ కుమార్ చెప్పారు. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం దేవాలయం మునిగినప్పటికీ.. ఇప్పటికీ మంచి కండిషన్ లోనే ఉందని తెలిపారు.

ఈ ఆలయాన్ని మరోచోట ఏర్పాటు చేస్తామని... ఆ టెక్నాలజీ తమ వద్ద ఉందని చెప్పారు. మునిగిపోయిన ఆలయాన్ని తాము గుర్తించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 65 దేవాలయాలు నీట మునిగాయని... వీటిలో ఈ దేవాలయం అత్యంత ఎత్తైనదని చెప్పారు. మరోవైపు స్థానికులు మాట్లాడుతూ, నీటి మట్టం కంటే ఎత్తులో 11 ఏళ్ల క్రితం తొలిసారి దేవాలయం పైభాగం కనిపించిందని చెప్పారు. అప్పటి నుంచి రీసర్చర్లు దాన్ని ట్రాక్ చేస్తున్నారని తెలిపారు. పురాతన ఆలయం బయటపడటంతో... దాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారు. దీంతో, లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కొంత సందడి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha temple  Mahanadi River  INTACH  Nayagarh  Lord Gopinath  Lord Vishnu  500 years old Temple  

Other Articles