Telangana govt. issues ordinance on pension, salary cut అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల కోతకు ఆర్డినెన్స్

Telangana brings ordinance on deferment of salaries and pensions

Telangana govt., Telangana ordinance, Telangana State United Teachers Federation, KCR government, COVID-19 lockdown, Telangana financial crisis, deferment of salaries, disaster and public health management, Telangana disaster and public health management, Telangana coronavirus lockdown, covid-19 cases in Telangana, Telangana covid-19 lockdown, Telangana lockdown losses

The Telangana government promulgated an ordinance in the name of the Governor to make special provision for deferment of any payment in part to any person, institution, employee or pensioner in the event of disaster and public health management in the State.

అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల కోతకు ఆర్డినెన్స్

Posted: 06/17/2020 07:46 PM IST
Telangana brings ordinance on deferment of salaries and pensions

విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుకు ఆమోదముద్ర లభించింది. దీంతో తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్‌ 2020కి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఆరు నెలల పాటు ఈ అర్డినెన్స్ అమల్లో వుండనుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగాల వేతనాల్లో కోత విధించిన క్రమంలో ఈ ఆర్డీనెన్సును ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఈ ఆర్డినెన్సు సారాంశం..  “ఏ ఇతర చట్టం, నియమం లేదా ఉత్తర్వు లేదా కోడ్ లేదా తీర్పు లేదా ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ యొక్క ఉత్తర్వులలో ఏదైనా ఉన్నప్పటికీ, విపత్తు లేదా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి లేదా ఇతర పరిస్థితుల నుండి తలెత్తే పరిస్థితుల నిర్వహణ కోసం ప్రభుత్వ ఉద్యోగలు, పెన్షన్లు చెల్లించాల్సిన మొత్తంలో సగం మించకుండా లేదా చెల్లించాల్సిన మొత్తానికి, చెల్లించాల్సిన మొత్తాన్ని సగం మించకుండా లేదా పాక్షిక చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తోంది”.

విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో గరిష్ఠంగా 50శాతం కోత విధించేలా ఆర్డినెన్స్‌ రూపొందించింది. కోత విధించిన మొత్తాన్ని ఆర్నెల్లలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని పేర్కొంది. పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. పింఛన్లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Employees  Telangana ordinance  KCR government  COVID-19  lockdown  salaries  pensions  disaster  

Other Articles