SC asks CBSE Board to cancel exams సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేయండీ: సుప్రీంకోర్టు

Sc tells cbse to consider scrapping of remaining exams and allot marks on basis of internal assessment

cbse, cbse board exams cancel, cancel cbse board exams, supreme court cbse board exams, hrd ministry cbse board exams, parents cbse board exams, cbse board exam, cbse exam scrapping, supreme court, supreme court on cbse board exam, cbse board exam, cbse 10th exams, cbse 12 exam, cbse board exam cancelled, supreme court, students, parents

The Supreme Court of India on Wednesday told CBSE to consider scrapping of remaining papers of class 10th and 12th board exams and to allot marks on the basis of internal assessment. A 3-judge bench headed by Justice AM Khanwilkar asked CBSE to take instructions and inform by Tuesday.

సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేయండీ: సుప్రీంకోర్టు

Posted: 06/17/2020 07:41 PM IST
Sc tells cbse to consider scrapping of remaining exams and allot marks on basis of internal assessment

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూ.. రోజురోజుకూ వ్యాప్తి అధికమౌతున్న తరుణంలో విద్యార్థుల జీవితాలతో సీబీఎస్ఈ బోర్డు చెలగాటం ఆడకుండా సత్వర్యంగా నిర్ణయం తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మానవవనరుల మంత్రిత్వశాఖను అదేశించింది. సీబీఎస్ఈ పదవ తరగతి, పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేయడాన్ని పరిశీలించాలని జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానానికి చెందిన తిసభ్య ధర్మాసనం పేర్కోంది. తరగతుల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల మార్కుల ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని న్యాయస్ఝానం అభిప్రాయపడింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని రానున్న మంగళవారం నాటికి తెలియజేయాలని సీబీఎస్ఈ బోర్డును న్యాయస్థానం అదేశించింది.

సీబీఎస్ఈ మాత్రం ఇప్పటికే అటు పదో తరగతి, ఇటు పన్నెండవ తరగతికి చెందిన పలు సబెక్టులకు పరీక్షలను ఇప్పటికే నిర్వహించింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పరీక్షలు అర్థంతరంగా నిలిచిపోయాయి. దీంతో జూలై 1 నుంచి జూలై 15 మధ్య మిగిలిన పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్‌ఈ యోచిస్తోంది. దీంతో సీబీఎస్ఈ బోర్డుపై విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి దేశంలో నానాటికి తన వ్యాప్తిని విస్తరింపజేసుకుంటున్న తరుణంలో సీబీఎస్ఈ బోర్డు మాత్రం పరీక్షలు నిర్వహిస్తోందట అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దేశంలో నెలకోన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఓ విద్యార్థి తండ్రి అమిత్ బాత్లా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కరోనా ఉదృతి కోనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించినా తాము తమ పిల్లలను పరీక్షలకు పంపించలేమని ఆయన పిటీషన్లో పేర్కోన్నారు. ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తుందో తెలియని కరోనాతో యుద్దం చేస్తూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి మనోవేధనను అనుభవించాల్సి వస్తుందని అమిత్ బాత్లా తన పిటీషన్ లో పేర్కోన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసి వారి ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లను కేటాయించాలని న్యాయస్థాన ధర్మాసనం అదేశించింది.

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు విదేశాలలో వున్న 250 పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసిందని, కానీ దేశంలో రద్దు చేయలేదని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పిటీషన్ లో పేర్కోన్నారు. ఇక తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను పరిగణలోకి తీసుకుని పదో తరగతి, పన్నెండవ తరగతి పరీక్షలపై తుది నిర్ణయం ఏమి తీసుకోవాలన్న అంశంమై సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులు కూడా హజరుకానున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles