SC Blasts State Over Hospitals on Covid-19 situation కరోనా రోగులంటే.. పశువుల కన్నా హీనమా.? మండిపడ్డ సుప్రీం

Delhi situation horrendous supreme court blasts state over hospitals

Coronavirus cases, coronavirus, Supreme Court on coronavirus patients, community transmission, Coronavirus, Coronavirus India, ICMR DG Balram Bhargava, ICMR, AIIMS Delhi, National, Politics

Coronavirus patients are being treated 'worse than animals', the Supreme Court said today as it pulled up the Delhi government over the 'horrendous, horrific and pathetic' situation in the national capital amid a spurt in cases.

కరోనా రోగులంటే.. పశువుల కన్నా హీనమా.? మండిపడ్డ సుప్రీం

Posted: 06/12/2020 11:48 PM IST
Delhi situation horrendous supreme court blasts state over hospitals

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోనూ రోజురోజుకీ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. దీంతో దేశంలో ఇప్పటికే రమారమి మూడు లక్షల మంది దీన ప్రభావం భారిన పడ్డారు, రోజురోజుకీ వేల సంఖ్యలో్ వస్తున్న కరోనా పేషంట్లను చికిత్స చేయడంలో డాక్టర్లకు తలకుమించిన బారంగా తయారైంది. దీంతో కరో్నా పేషంట్ల విషయంలో డాక్టర్లు, ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరించడం లేదన్న వాజ్యాలు న్యాయస్థానాలలో దాఖలైనా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులపై, మరణాలు, చికిత్సలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలపై తీవ్రంగా మండిపడింది.

దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మండిపడిన న్యాయస్థానం ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని తీవ్రంగా మండిపడింది. కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను అత్యంత కట్టుదిట్టంగా అంత్యక్రియలు జరపాల్సివుండగా.. అవి చెత్తకుప్పలో కనబడటం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళనకరమి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

దేశ రాజధాని నగరంలో కరోనా పరీక్షల శాతం ఎందుకు తగ్గడం పై కూడా ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. తొలుత కరోనా పరీక్షల నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్రమంగా ఎందుకు పరీక్షలను నిర్వహించడం తగ్గించిందని ప్రశ్నించింది. గతంలో రోజుకు 7వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు కేవలం 5వేల పరీక్షలే చేస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెన్నై, ముంబై నగరాల్లో 16వేలు నుంచి 17వేలకు పరీక్షల సంఖ్య పెరిగిందని పేర్కొంది. ఇక కరోనా రోగులకు ఆస్పత్రుల్లో పడకలు లేవన్న మీడియాలో కథనాలు వస్తున్న తరుణంలో.. ప్రభుత్వాలు మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నాయని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేసింది.

కరోనా లక్షణాలు కనిపించిన ప్రతీవారితో పాటు వారితో కాంట్రాక్టు అయిన వారందరికీ తక్షణం పరీక్షలు నిర్వహించాలని అదేశించిన న్యాయస్థానం.. ఈ క్రమంలో అవసరమైతే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని తెలిపింది. కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేదన్న మీడియా కథనాలు చూస్తేనే పరిస్థితి అర్థం అవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles