From Daily labour to DSP: Kothapalli Narasimha inspirational Story సరస్వతీ కటాక్షం.. కష్టం కలిసోచ్చాయ్.. కూలీని డీఎస్సీగా చేశాయ్..

Dsp kothapalli narasimha an inspiration for the generation next

Kothapalli Narasimha, Kothapalli Narasimha life story, DSP Kothapalli Narsimha, Kothapalli Narsimha Success tips, DSP Kothapalli Narsimha, Kothapalli Narasimha latest, Kothapalli Narasimha students, Kothapalli Narasimha journey, Kothapalli Narasimha DSP, Kothapalli Narasimha Groups

Kothapalli Narasimha is born in a lower-class family and worked as a daily laborer but he never neglected his studies.

సరస్వతీ కటాక్షం.. కష్టం కలిసోచ్చాయ్.. కూలీని డీఎస్సీగా చేశాయ్..

Posted: 06/12/2020 11:59 PM IST
Dsp kothapalli narasimha an inspiration for the generation next

ప్రస్తుతం సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిలో ఎందరో చిన్నప్పుడు ఆకలి, అవమానాలను దిగమింగినవారే. అయితే ఉన్నతస్థాయిలోకి చేరిన తరువాత వారిలో కొందరు మాత్రమే నిజాయితీగా తమ చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని నిజాయితీగా వుంటారు. అలాంటివారిలో ఒక్కరే కొత్తపల్లి నర్సింహా. చిన్నతనంలో తాను చేసిన పనిని ఆయన గర్వంగా ఫీలవుతూ చెప్పుకున్నారు. ఇప్పుడు డీఎస్సీగా తాను విధులు నిర్వహిస్తున్నా.. తాను చిన్నప్పుడు వ్యవసాయ కూలి పనులు చేశానన్నారు. తనకు సరస్వతీ కటాక్షం ఉండటంతో అదే తనకు లక్ష్మీ కటాక్షాన్ని కూడా తీసుకువచ్చిందని నమ్మతున్నారు. అయితే దానికి తన అకుంఠిత దీక్ష, కష్టపడే చదివే తత్వం కూడా తోడైందని చెప్పుకోచ్చారు.

సరస్వతీ కటాక్షం అంటే.. చదువుపై ఆయనకున్న ఆసక్తి. తన కుటుంబం చిన్ననాటి నుంచి అనుభవిస్తున్న పేదరికం నుంచి విముక్తులం కావాలంటే ఉన్నత స్థానాలను అందుకోవాలన్నది అతని తపన. అయితే ఆ ఉన్నత స్థానాలకు ఆయనకు కనిపించిన ఒకే మార్గం విద్య. అంతే.. ఎంత చదువితే అంత ఉన్నత స్థానం సంపాదిస్తానని గ్రహించిన నర్సింహ.. ఏనాడు విద్యుకు దూరంగా జరగలేదు. ప్రభుత్వ ఉద్యో్గం అందినా.. తన పయనాన్ని మాత్రం సాగించక అపలేదు. ఆలా ధృడంగా సాగిన ఆయన పయనానికి ఇప్పుడందిన స్థానం డీఎస్సీ. తొలుత టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత గ్రూప్-1 పోటీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం సాధించారు.

నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సింహ జీవితం భవిష్యత్తులో అలాంటి ఉన్నత పదవులను అందుకో్వాలన్న విద్యార్థులకు, యువతకు ఆధర్శప్రాయంగా నిలుస్తోంది. నర్సింహ అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. అన్న, అక్క కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆయన చదువు ఏడో తరగతి వరకు స్థానికంగా ఉన్న స్కూల్లో, తర్వాత పదో తరగతి వరకు పక్క ఊరు పుల్లెంలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. 1998లో పదో తరగతి పూర్తయింది. మండల కేంద్రంలోని డాన్ బోస్కో జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేశాను. 2002లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్త చేశారు. అప్పటికీ తన ముందు వున్న సుదూర లక్ష్యాలను టార్గెట్ చేస్తూనే.. తాత్కాలికంగా తమ కుటుంబాన్ని అదుకునే ఉద్యేశ్యంలో డీఎస్సీ రాసి జిల్లాలో అయిదో ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడయ్యాడు. 

అయితే ఉపాధ్యయుడిగా ప్రభుత్వ ఉద్యో్గం వచ్చినా.. ఇది తన లక్ష్యం కాదనుకున్నాడు. ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూనే మరోవైపు తన సుదూర గమ్యాన్ని చేధించే పనిలో వున్న నర్సింహ.. ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఎమ్మెస్సీ మ్యాథ్స్ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు 2007లో గ్రూప్-1, 2లకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్స్ ప్రిపరేషన్ కు ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చాడు. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో 50 మార్కుల విభాగానికి మాత్రం కోచింగ్ తీసుకున్నాడు. గ్రూప్-1లో డీఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు అదే సమయంలో గ్రూప్ 2లోనూ ఏసీటీవోగానూ ఎంపికయ్యాడు.

ఒ వైపు గ్రూప్ 2 వచ్చినా.. తనకు పోలీసుల అధికారి కావాలన్న కలను సాకారం చేసుకునేందుకు డీఎస్సీ పదవిని చేపట్టేందుకే అధిక ప్రాధన్యతను ఇచ్చాడు నర్సింహా. దూరవిద్యలో ఇంటర్ పూర్తి చేసిన తరువాత నర్సింహ రాసిన అన్ని పరీక్షలు పోటీ పరీక్షలే కావడం విశేషం. ఇక అంతకుముందు ప్రభుత్వ ఉద్యో్గం కో్సం కూడా ఆయన తనతోపాటు వేల సంఖ్యలో్ వున్న ఆశావహులతో పోటీపడ్డాడు. అందుకు కావాల్సింది ఆత్మవిశ్వాసం అంటున్నాడు నర్సింహా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలు చాలా కష్టమైనవిగా భావిస్తుంటారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారే వాటిని సులువుగా సాధించగలరనే అపోహను ముందుగా దూరం చేసుకోవాలి.

విషయ పరిజ్ఞానం వుంటే ఎంతటి పోటీ పరీక్షలో అయినా ఎదుర్కోవచ్చునని అన్నారు. గ్రూప్స్‌ వైపు అడుగులు వేసిన సమయంలో తనకు ఎలాంటి గెడైన్స్ లేదు. దినపత్రికలు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా వచ్చే మేగజైన్లలో ప్రచురితమయ్యే విజయగాథలే తనలో ప్రేరణ కలిగించాయన్నారు. ఇక పోటీ పరీక్షలకు ముఖ్యంగా కావాల్సింది సిలబస్ ను పూర్తిగా ఆకళింపు చేసుకోవడమన్నారు. సిలబస్ కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రామాణిక పుస్తకాలు సేకరించుకోవాలి. కనీసం అయిదుసార్లు సిలబస్ పూర్తిచేయాలి. ఏకాగ్రతతో రోజుకు 10 గంటలు చదివితే సరిపోతుంది. ఇతర అభ్యర్థులతో చర్చిస్తూ చదవడం వల్ల అన్ని అంశాలు బాగా గుర్తుంటాయన్నారు.

కొత్తపల్లి నర్సింహ డిఎస్సీగా బాధ్యతులు నిర్వహిస్తుండంలో గొప్పేముంది. చాలా మంది చిన్నప్పుడు కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకునే వృద్దిలోకి వచ్చారు అనేవాళ్లు లేకపోలేదు. అయితే పాఠశాలల్లో విద్యాబాస్యం చేయడంలో పాటు ఆ తరగతి పాఠాలను ఏ రోజకారోజు వల్లేవేసుకుని, ఇంట్లో తన తల్లిదండ్రులకు సాయం చేసేవాడు. ఇక వ్యవసాయ కూలీలైన తన అమ్మానాన్నలతో పాటు సెలవులు, పండుగలు, వేసవి సెలవులు వచ్చిన క్రమంలో వారితో పాటు వెళ్లి పనులు చేసి వచ్చేవాడు. మరీముఖ్యంగా వేసవి సేలవుల సమయంలో.. తన తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ కూలి పనులకోసం మిర్యాలగూడ వంటి ప్రాంతాలకు వెళ్ల్లేవారు. ఆయన తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తనపై రూ.50 వేల అప్పు భారం పడింది. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అయినా మొక్కవోని దైర్యంతో పుస్తకాన్ని అందుకున్నాడు.. యువతకు అదర్శంగా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles