Srivari Laddu Prasadam to devotees at reduced Prices శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్ ధరల లడ్డూలు

Srivari laddu prasadam to devotees begins from may 22 ttd chairman

Tirupati, Tirumala, TTD, Laddu Prasadam, Lockdown, Srivari Laddu prasadam, Srivari Laddu, Devotees Reduced Prices, Coronavirus, Andhra Pradesh

After 60 days of gap due to lockdown, the Tirumala Tirupati Devasthanams has resumed its Prasadam sales at the TTD Administrative Building in Tirupati on trial basis. For this a special counter has been set up by the officials near the employees' canteen at the Administrative Building.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్ ధరల లడ్డూలు

Posted: 05/20/2020 03:59 PM IST
Srivari laddu prasadam to devotees begins from may 22 ttd chairman

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూల అమ్మకాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో గత 60పైచిలుకు రోజుల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం బాగ్యం కలగడం లేదన్నది వాస్తవం. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడు భక్తులకు కలుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత 60 రోజులుగా శ్రీవారి భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్న నేపథ్యంలో కల్పించలేకపోవడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. దర్శనాలు ఎప్పుడు పునఃప్రారంభిస్తామో ఇప్పట్లో చెప్పలేమన్నారు.

అయితే భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని తితిదే బోర్డు నిర్ణయించిందని చెప్పారు. లడ్డూ ఒకటి రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేయనున్నామని.. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్‌ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం 98495 75952, 97010 92777ను సంప్రదించవచ్చని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles