Two bears rescued from well in Maharashtra బావిలో ఎలుగుబంట్లు.. నిచ్చెన సాయంతో బయటకు..

Green frontline warriors rescue two bears from well using ladder

bears, bears rescued from well, wildlife videos, viral videos, twitter, netizens, Gondia, social media, salekasa range, susanta nanda, forest officials

Two bears were rescued from a well by officials and staff in Maharashtra on Tuesday. Susanta Nanda of the Indian Forest Service shared a 41-second video of the rescue mission on Twitter and applauded the officials for saving the bears.

బావిలో ఎలుగుబంట్లు.. నిచ్చెన సాయంతో బయటకు.. వీడియో వైరల్

Posted: 05/20/2020 03:10 PM IST
Green frontline warriors rescue two bears from well using ladder

మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు చక్కని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వారు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు జట్టు కురుస్తోంది. ఇంతకీ వారు ఎవర్ని కాపాడారు.? ఎలా కాపాడారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? గొండియా జిల్లాలోని సాలెకాసా అటవీ ప్రాంత రేంజ్ లో సంచరిస్తున్న రెండు ఎలుగుబంట్లు బావిలో పడ్డాయి. బావిలో పడి నీళ్లలో కొట్టుకుంటున్నాయి. మనుషులను అనుకరించే ఈ ఎలుగుబంట్లు అచ్చంగా మనుషుల తరహాలోనే బావిలోంచి బయటకు వచ్చాయి.

అదెలా అంటే.. బావిలో పడ్డ రెండు ఎలుగు బంట్లు నీటిలోనే కొట్టుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గోండియాలో సాలెకాసా రేంజ్ కు చెందిన అటవీశాఖ అధికారులకు తెలిపారు. వాటిని కాపాడేందుకు ఇద్దరు రేంజర్లు రంగంలోకి దిగారు, నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు కూడా వారి శ్రమను కరతాళధ్వులతో స్వాగతించారు. అయితే ఇక్కడ వారు ఏకంగా రెండు గంటల పాటు శ్రమించిన తరువాత వారి ప్రయత్నాలను నిచ్చెనే గట్టెక్కించింది.

ఎలుగుబంట్లను బయటకు తీసేందుకు వారికి కనిపించిన ఒకే మార్గం నిచ్చెన. అంతే స్థానిక గ్రామస్థుల నుంచి ఓ నిచ్చెనను ప్రయత్నంలో భాగంగా బావిలోకి నిచ్చెన వేశారు. దీంతో ఆ ఎలుగుబంట్లు నిచ్చెనను పట్టుకుని మనుషుల్లా ఎక్కుతూ బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంట్లు బయటపడిన తీరును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles