US firm's COVID-19 vaccine trial shows positive results అమెరికా కరోనా వాక్సీన్ తొలి ట్రయల్స్ విజయవంతం

Moderna says covid 19 vaccine shows promise in early trials excites markets

coronavirus vaccine, Clinical trial, covid-19 vaccine, coronavirus, protective antibodies, Moderna Inc, covid 19 vaccine, Corona Virus, COVID-19, USA

Moderna Inc's experimental COVID-19 vaccine, the first to be tested in the United States, produced protective antibodies in a small group of healthy volunteers, according to very early data released by the biotech company

సత్ఫలితాలిస్తున్న అమెరికా కరోనా వాక్సీన్.. తొలి ట్రయల్స్ విజయవంతం

Posted: 05/19/2020 05:48 PM IST
Moderna says covid 19 vaccine shows promise in early trials excites markets

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఔషదంలేని ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు పలు దేశాలు లాక్ డౌన్ నే ఆశ్రయించడంతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా తన ఉధృతిని చాటుకుంటూ వెళ్తుండగా, దాని అంతం చూసే వ్యాక్సిన్ తయారీలో పరిశోధకులు తలమునకలుగా ఉన్నారు. ఇప్పటికే పలు దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నమై వాటిని ఎలుకలు, కొతులపై కూడా పరిశోధనలు జరిపి విజయవంతం అయ్యారు.

అయితే హ్యూమన్ ట్రయల్స్ మాత్రమే మిగిలివున్నాయి. వీటి కోసం కూడా అనుమతులకు పలు సంస్థలు ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకున్నాయి. ఇక ఈ విషయంలోనూ విజయం సాధించింది అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ. తొలిదశలో విజయం సాధించిన ఇక మలిధశలో కూడా మెడెర్నా సంస్థ వాక్సీన్ ముందంజలో నిలిచింది. ఈ సంస్థ ఆవిష్కరించిన వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. వైరస్ కు వ్యతిరేకంగా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

తొలిదశ హ్యూమన్ ట్రయల్స్ ప్రయోగాలు మొదలయ్యాయి. మార్చిలో 8మంది ఆరోగ్యవంతులపై ఒక్కొక్కరికి రెండుడోసుల చొప్పున ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి చూడగా, వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవడాన్ని గుర్తించారు. అంతేకాదు, ఆ యాంటీబాడీలు కరోనా వైరస్ కణాల ప్రత్యుత్పత్తిని కూడా అడ్డుకుంటున్నాయని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఓ వ్యాక్సిన్ లో ఇదే కీలక అంశమని, రెండో దశలో 600 మందిపై త్వరలోనే ప్రయోగాలు ఉంటాయని మోడెర్నా సంస్థ పేర్కొంది. జూలైలో నిర్వహించబోయే మూడో దశలో వేలాదిమంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి చూస్తామని వెల్లడించింది. అటు, ఎఫ్ డీయే (అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా రెండో దశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వడంతో మోడెర్నా సంస్థ పరిశోధకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles