Schools in Andhra Pradesh to reopen on Aug 3 ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Ap schools to re open on august 3 ysr vidhya kanuka for students to launch on same day

Andhra Pradesh schools, YS Jagan Mohan Reddy, YSR Vidhya Kanuka, August 3rd, Chief Minister, School Students, Andhra Pradesh, Politics

Andhra Pradesh schools would reopen on August 3, 2020, after a gap of almost 4 months. AP Chief Minister YS Jagan Mohan Reddy would launch YSR Vidhya Kanuka for students on the same day where all the students going to school will be provided with uniforms, books, belt, shoes, and socks.

ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం, అదే రోజున విద్యా కానుక అమలు

Posted: 05/19/2020 04:55 PM IST
Ap schools to re open on august 3 ysr vidhya kanuka for students to launch on same day

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రంలోని ప్రభుత్వం భావితరాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని.. వారి విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండాలని భావిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల విషయంలోనూ అచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం లాక్ డౌన్ అమలుతో రాష్ట్రంలో మూతబడిన విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు తేదీని ఫిక్స్ చేసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించారు.

అంతేకాదు అదే తేదీన విద్యార్థులకు కానుకను కూడా అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఆగస్టు 3వ తేదీన వైఎస్‌ఆర్ విద్యా కానుకను కూడా అమలు చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సాధారణ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కువ మంది వచ్చే ప్రాంతాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. మరో రెండు మూడురోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభించే యోచనలో వున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజారవాణ వ్యవస్థలను వినియోగించుకునే వారందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పని సరి చేయాలన్నారు. గత లాక్‌డౌన్‌లో అనుసరించిన విధానాలు ఒకలా ఉంటే.. లాక్‌డౌన్‌-4లో అనుసరించాల్సిన విధానాల్లో అనేక మార్పులు ఉంటాయన్నారు. ఈ విడతలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని.. అందుకు కావాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణపై దృష్టి కొనసాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles