Women queued up in front of liquor shops లేచింది మహిళాలోకం.. పురుషులతో పోటీగా క్యూలైన్లలో..

Women queued up in front of liquor shops in hyderabad

Hyderabad wine shops, liquor shops, liquor shops in Hyderabad, lockdown, telangana news, covid 19, coronavirus in telangana, hyderabad liquor shops, hyderabad news, hyderabad latest news, Women queue liquor shops, Women queue liquor shops, women kondapur wines, hyderabad, telangana

To everyone's surprise, women were also seen standing in the queue in front of a liquor shop in Kondapur in Hyderabad. The women put on masks and ensured social distance between them.

ముదితల్ తాగగలేని మద్యముగలదే.. ముద్దారగ సేవించినన్..!

Posted: 05/06/2020 06:02 PM IST
Women queued up in front of liquor shops in hyderabad

దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రెండవ విడత లాక్ డౌన్ మే 3న ముగియడంతో నాల్గవ తేదీ నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా పలు చిత్ర, విచిత్రవార్తలు కూడా ప్రధాన శీర్షికలుగా మారాయి. అందులో ఒకటి మద్యం దుకాణాల వద్ద మహిళల ప్రత్యేక క్యూ. మద్యం కొనేందుకు పురుషులతో పోటీ పడిన మహిళలు.. అన్నవి కామన్. ఇటు బెంగళూరు, అటు ఫూణే ఇలా చాలా ప్రాంతాల్లో మహిళలు మద్యం కొనేందుకు క్యూలైన్లలో వేచివున్న ఫోటోలు, వీడియోలు నెటింట్లోనే హల్ చల్ చేశాయి. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్రానికి వస్తేనూ ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఇక్కడా అదే వార్త.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చిన మద్యం అమ్మాకాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాల్లో.. కంటైన్ మెంట్ జోన్లలోని 15 షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్ షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు.  అయితే.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్‌ లో భాగంగా బార్లు, పబ్బులు, క్లబ్ లు ఇతరాత్ర మద్యం సేవించే ప్రాంతాలన్నీ మూసివేయబడ్డాయి. దీంతో మద్యం అమ్మకాలు కేవలం వైన్ షాపుల్లో మాత్రమే లభించనుంది. దీంతో ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చిన మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు.

అయితే కార్పోరేట్ కల్చర్ ఇమిడివున్న హైదరాబాద్ మహానగరంలో సాప్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే అనేక మంది మహిళలు మద్యాన్ని సేవిస్తుంటారు. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లోని పలు వైన్స్‌ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొఖాలకు మాస్కులు ధరించి మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆ తర్వాత లిక్కర్ తీసుకుని వెళ్లారు.. మరోవైపు కోఠిలోని బగ్గా వైన్స్ దగ్గర కొందరు మహిళలు క్యూలైన్లలో వచ్చి మందు తీసుకెళ్లారు. నగరంలోని పలు మద్యం షాపుల ముందు క్యూ కడుతున్నారు మహిళలు.. మద్యం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చిన మహిళలు.. ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్ సిటీలో.. ఐటీ సెక్టార్‌లోని పలు మద్యం షాప్‌ల దగ్గర క్యూకట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles