Public transport may resume soon: Nitin Gadkari ప్రజారవాణ పునరుద్దరణ కేంద్రం సంకేతాలు

Public transport likely to resume soon with guidelines nitin gadkari

nitin gadkari, India lockdown, public transport, public transport during lockdown, bus services, uber, ola, nitin gadkari msme, Lockdown Guidelines

Minister of Road Transport and Highways, Nitin Gadkari, acknowledged that there was a need to re-start the public transport. The Union Minister was also of the view that flight, train and bus services should also resume in the near future as people remain stranded in different parts of the country.

మార్గదర్శకత్వాలతో ప్రజారవాణ పునరుద్దరణ.. కేంద్రం సంకేతాలు

Posted: 05/06/2020 07:01 PM IST
Public transport likely to resume soon with guidelines nitin gadkari

కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్త లాక్ డౌన్‌ అమలుతో ప్రజాజీవనం స్థంబించిపోయింది. ఇక ప్రజా రవాణా కూడా పూర్తిగా స్థంభించడంతో ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు, రోడ్డెక్కని బస్సులు, పట్టాలెక్కని రైళ్లు, వాయువేగంతో దూసుకెళ్లని పౌరవిమానాలు అన్ని ఒక్కసారిగా నిలిచిపోయాయి. మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చిన తొలివిడత, ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చిన రెండో విడత లాక్ డౌన్ లు ముగియడంతో మే 3వ తేదీ నుంచి మూడో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే మూడో విడతలో భాగంగా పలు సడలింపులను కేంద్రం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ జోన్లలో అర్టీసీ, అటో, క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

అయితే మూడవ విడత లాక్ డౌన్ అమల్లో వుండగానే పలు మార్గదర్శకాల్లో ప్రజా రవాణాను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని రహదారులు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్‌ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో ఆయ తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఈ మేరకు వారికి త్వరలోనే ప్రజా రవాణాను అనుమతిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే వీటికి నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్‌ మాస్క్‌లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఎప్పటి నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్ డౌన్‌ కొనసాగుతుంది. కాగా గ్రీన్ జోన్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులను ప్రకటించన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలోఉత్తేజం కల్పించేందుకు కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles