Shocking: Drunk Man Bites Snake Into Pieces! పామును నోటితో కొరికి చంపిన మందుబాబు..

Man bites snake into pieces for crossing his path in karnataka

man bites snake, man bites snake karnataka, snake, Snake video, man bites snake into pieces, man snake bite death, karnataka, liquor shops open, kolar snake, karnataka, viral video

In a bizarre incident, a man from Kolar in Karnataka bit a snake into pieces when it crossed his path as he was riding away on a bike. A video of this incident has now gone viral on social media.

ITEMVIDEOS: పామును నోటితో కొరికి చంపిన మందుబాబు..

Posted: 05/06/2020 05:18 PM IST
Man bites snake into pieces for crossing his path in karnataka

మందు రుచి లేక నలభై రోజులైంది. ఒక్కసారిగా మద్యం దుకాణాలు తీసేసరికి మందుబాబులు నానా విధాలుగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరిచారన్న ఆనందమో.. లేక చాలా రోజుల తరువాత మందు తాగామన్న సంతోషమో కానీ.. వారిలోని విచిత్ర గుణాలు బయటపడుతున్నాయి. కర్ణాటకలోని... కోలార్ లో మద్యం దుకాణానికి వెళ్లి కొంత మందేసి.. మరికొంత పట్టుకుని వస్తున్న ఓ వ్యక్తి బైక్ కు పాము అడ్డుగా వచ్చింది. అంతే నా బైక్ కే అడ్డు తగులుతావా అని.. పామును చేత్తో పట్టుకుని.. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడన్న సృహ కూడా లేకుండా.. నోటితో కొరికి చంపేశాడా మందుబాబు.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కోలార్ జిల్లా పరిధిలోని మస్తూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల కన్‌స్ట్రక్షన్ వర్కర్ కుమార్. మద్యం దుకాణం వద్దే మందుకొట్టి,, మరికోంత మద్యాన్ని తీసుకుని ఇంటికి తిరుగుపయనం అవుతుండగా, మార్గమధ్యంలో ఓ పాము బైకుకి అడ్డంగా వచ్చింది. దాన్ని చూడగానే అతనికి పిచ్చి కోపం వచ్చింది. అంతే దాన్ని కోపంగా చూశాడు. బైక్ రెండు చక్రాల మధ్య పాము ఉంది. దాన్ని పట్టుకున్నాడు. మెడలో వేసుకున్నాడు. కొంత దూరం బైక్ నడిపాడు. పాము అటూ ఇటూ కదులుతింటే... తిక్క రేగింది. అరే ఏందిరా ఇది... కుదురుగా ఉండదే... అనుకుంటూ... బైక్ ఆపి... పామును చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికే అక్కడి జనం... అతను పాము అలా పట్టేసుకున్నాడేంటి అని చూస్తుండిపోయారు.

పామును ఎడమ చేత్తో పట్టుకొని... నోటితో కొరికాడు. కసా కసా కొరుకుతుంటే... అందరూ ఆశ్చర్యపోతూ చూశారు. అరే ఏంటిది... ఎందుకిలా చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కొంత మంది వీడియోలు, ఫొటోలూ తీశారు. విషయం తెలిసి... అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే పాము చచ్చిపోయింది. పోలీసులు అతని అడ్రెస్ తెలుసుకొని... ఇంటికి వెళ్లారు. ఎందుకిలా చేశావని అడిగారు. అమ్మతోడు సార్... అది పామని నాకు అస్సలు తెలియదన్నాడు. కానీ... తనకేం కాదని నమ్మకం ఉంది అంటూ... తన మూడేళ్ల కొడుకువైపు చూశాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లావా... అంటే... అక్కర్లేదు సారూ... మా ఊళ్లో... ఇట్టాంటి పాముల్ని సంపుతూనే ఉంటాం అన్నాడు.

మస్తూర్ గ్రామం బెంగళరూరుకి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎస్సై... ఓ కానిస్టేబుల్ ని కుమార్‌కి అప్పగించాడు. కుమార్‌కి గనక ప్రాణాపాయం అయితే... ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆర్డరేశాడు.
ఈ మొత్తం ఘటనపై... పర్యావరణ వేత్త వీఎస్ఎస్ శాస్త్రి స్పందించారు. జనరల్ గా విషపూరిత పాములు... తమ జోలికి వస్తే వెంటనే కాటేసి... పెద్ద మొత్తంలో విషాన్ని చిమ్ముతాయని చెప్పారు. ఈ ఘటనలో అలా జరగకపోవడం ఆశ్చర్యకరం అన్నారు. ఇలాంటి పనులు చెయ్యడం ప్రాణాలకే ప్రమాదమనీ, ఎవరూ అలా చెయ్యవద్దనీ సూచించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కుమార్ అరోగ్యంగానే వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles