CoronaVirus Puts UK PM in Intensive Care ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఇంకా విషమంగానే..

No change in british pm boris johnson s condition sources

UK Prime Minister, covid-2019, coronavirus, Britain PM coronavirus, britain PM, boris johnson Coronavirus, London

There has been no change in Boris Johnson's condition, two sources close to him said on Tuesday, after the British prime minister was taken into intensive care following a deterioration in his coronavirus symptoms.

కరోనా వైరస్: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఇంకా విషమంగానే..

Posted: 04/07/2020 12:18 PM IST
No change in british pm boris johnson s condition sources

కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందని అక్కడి వైద్యవర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయనలో వ్యాధి తీవ్రత అంతకంతకూ పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. కానీ, వైరస్‌ లక్షణాలు ఇంకా కనిపిస్తుండటంతో ఆదివారం ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. బోరిస్ వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా, 24 గంటల వ్యవధిలో ఆయనలో వ్యాధి తీవ్రత తగ్గించేందుకు వైద్యులచేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి, దీంతో సోమవారం నాటికి వ్యాధి తీవ్రత మరింతగా పెరగడంతో వైద్యులు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకి తరలించారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయనలో ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

‘‘నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను’’ అని జాన్సన్‌ తెలిపారు. అయితే, వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్టు గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు. ఆయన త్వరగా కొలుకోవాలని బ్రిటన్ వాసులు ప్రార్థనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles