Trump says to retaliate if India doesn't lift anti-malarial drug ban నిషేధం ఎత్తివేయకుంటే.. భారత్ పై ప్రతీకారం: ట్రంప్

Us president says he d be surprised if india didn t allow hydroxychloroquine export

Donald Trump warned India of “retaliation", Trump warns india of retaliation, trump request lift on anti-malarial drug, trump reqiest modi, trump request for hydroxychloroquine from india, India, US, Trump, Modi, Narendra Modi, Donald Trump, hydroxychloroquine, coronavirus, covid-19

US President Donald Trump warned India of “retaliation" if it turns down his request to lift the hold on export of an anti-malarial drug being used in the treatment of covid-19.

నిషేధం ఎత్తివేయకుంటే.. భారత్ పై ప్రతీకారం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/07/2020 01:54 PM IST
Us president says he d be surprised if india didn t allow hydroxychloroquine export

కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడంలో కీలకంగా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషదం భారత్ అమెరికాల మధ్య నెలకొన్న శాంతియుత వాతావరణాన్ిన భగ్నం చేస్తోందా.? అంటే అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది. ఓ వైపు కరోనా రక్కసి ప్రపంచ దేశాలపై తన పంజా విసిరి.. ప్రజల ప్రాణాలను కటళించి వేస్తోంటే.. అమెరికా మాత్రం తనకు కావాల్సిన ఔషదాల కోసం భారత్ పై హెచ్చరికలు జారిచేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వున్న ద్వైపాక్షిక సంబంధాలు కూడా దెబ్బతింటాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే ప్రతీకార చర్యలు వుంటాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయడమే ఈ పరిణామాలుకు అసలు కారణం. తన విన్నపాన్ని భారత్ మన్నించి నిషేదాన్ని ఎత్తివేయకపోతే అది తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ట్రంప్‌ అన్నారు. అమెరికాతో భారత్‌ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆయన మీడియా తో అన్నారు,

కాగా, కరోనా వైరస్ వ్యధి తీవ్రత నేపథ్యంలో తాను భారత్ ప్రధాని నరేంద్రమోడీ క్లోరోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?’’ అని సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఔషధ రంగంలో అమెరికాకు భారత్‌ సుదీర్ఘకాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్‌ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్‌ జీ వెల్స్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనీపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  US  Trump  Modi  Narendra Modi  Donald Trump  hydroxychloroquine  coronavirus  covid-19  

Other Articles