Coronavirus: Tunisia deploys robots to enforce lockdown లాక్ డౌన్ సమయంలో తాటతీస్తున్న రోబో పోలీస్..

Tunisia using unmanned robots to enforce lockdown during coronavirus

oronavirus, COVID-19, cameras, lockdown procedures, robot, robo guards, robo police, unmanned ground vehicle (UGV), Identity card, Tunisia

Tunisia’s Ministry of Interior is using the locally developed unmanned ground vehicle (UGV) to monitor the streets of the capital Tunis as part of the government’s COVID-19 response. The vehicle was seen in Tunisia after the Ministry of Interior contracted Enova Robotics to help patrol and enforce the country’s lockdown order, effective since 22 March.

లాక్ డౌన్ సమయంలో తాటతీస్తున్న రోబో పోలీస్.. గుర్తింపు కార్డే రక్ష..

Posted: 04/04/2020 06:55 PM IST
Tunisia using unmanned robots to enforce lockdown during coronavirus

కొందరు ఆకతాయిలకు కరోనా వైరస్‌ తీవ్రత అర్థం కావడం లేదు! ఈ వైరస్ పట్ల ఏమాత్రం అప్రమత్తంగా లేకుండా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే అంచనావేస్తున్న ప్రభుత్వాలు ఏకంగా దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడంతోపాటు దేశ ప్రజలెవ్వరూ అత్యంత అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. అయినా అకాతాయిలు మాత్రం ఏదో కారణం చప్పి ఇళ్లలోంచి బయటకు వచ్చి రోడ్లపై బలాదూర్ తిరుగుతున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కొట్టినా.. లేక వీరు పోలీసులపై తిరుగబడినా.. అదే పెద్ద సమస్యగా మారుతోంది.

ఇలాంటి సమస్యలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల డ్యూటీని ఓ రోబో చేస్తోంది. రోడ్ల మీదకు నిర్లక్ష్యంగా ఎవరు వచ్చినా వారిని పట్టుకుని వదలనే వదలదు. తమ వద్ద ఉన్న ఐడీకార్డు చూపిస్తేగాని వదలదు. అయితే ఇది ఇండియాలో మాత్రం కాదండీ. ట్యుననీసియా దేవంలో ఈ రోబో పోలీసులు.. పోలీసులకు బదులు గస్తీ కాస్తున్నాయి. పోలీసులతో పాటు ఆ రోబో కూడా పెట్రోలింగ్ డ్యూటీ చేస్తోంది. నాలుగు చక్రాలు గల ఈ పోలీస్ రోబోలను ‘పీగార్డ్స్’ అని పిలుస్తున్నారు. వీటిలో థర్మల్ ఇమేజింగ్ కెమెరా, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాధనాలు ఉంటాయి.

ఇది రాడార్‌లా పని చేసినప్పటికీ.. రేడియో తరంగాల బదులు లైట్‌ను వినియోగించుకుంటుందట. ఈ పోలీస్ రోబోలను ట్యునీసియా ప్రజలు కొందరు దీని సేవలు బాగున్నాయని అన్నా.. మరికొందరు మాత్రం ఇది మరీ స్లోగా నడుస్తోందని ముక్కు విరుస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీటి పనితీరుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఫేస్ బుక్ లో వీటి వీడియోలను పోస్ట్ చేస్తోంది. కాగా, ట్యునీసియా దేశంలో ప్రస్తుతం 436 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 14 మంది  మరణించారు. మాస్కులు తయారు చేసేందుకు సుమారు 150 మంది సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles