పాకిస్తాన్, చైనాల మధ్య మాంచి దోస్తానీ ఉంది. పాక్ తుమ్మితే చైనా కర్చీఫు అడ్డం పెట్టే రకం. దక్షిణాసియాలో ప్రాంతీయ అధిపత్యం కోసం చైనా పాకిస్తాన్కు తరచూ డబ్బు సాయం కూడా చేస్తుంటుంది. రెండూ కలసి సరిహద్దులో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపడుతుంటాయి. ఇవన్నీ పాత సంగతులే కదా. అయితే కరోనా వ్యవహారంలో పాక్కు చైనా మాంచి మస్కా కొట్టింది. ‘ఇంద మా సాయం ఇదీ.. బాగా వాడుకోండి.. ’ అంటూ నీచనికృష్టకంపు సాయం చేసింది!
కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాక్కు భారీ సంఖ్యలో ఎన్95 మాస్కులను పంపిస్తామన్న చైనా వాటికి బదులుగా పనికిమాలిన మాస్కులను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుగున్నాయి. పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. చైనా నుంచి మాంచి నాణ్యమైన మాస్కులను వస్తాయని ఆశగా ఎదురు చూసిన సింధ్ రాష్ట్ర అధికారులు తమ చేతికందిన వాటిని చూసి మూర్ఛపోయారు. వాడిపడేసిన లోదుస్తులు, పాతగుడ్డలతో ఆ మాస్కులను తయారు చేశారు. ‘చైనా మా ముఖానికి సున్నం పూసింది..’ అని వాపోయారు. దీన్ని జీర్ణించుకోక మాస్కులను తిరిగి వెనక్కి వెనక్కి పంపించారు.
China promised to send top quality N-95 masks to Pakistan. When the consignment landed, Pakistanis found that China had sent masks made of underwear.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) April 4, 2020
Pakistani anchor says “China ne Choona laga diya”. #ChineseVirusCorona pic.twitter.com/3H4Uo151ZJ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more