COVID-19: 10 cases in one day in Telangana, total 59 ఏప్రిల్ 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడగింపు

Coronavirus telangana reports 10 positive cases in a day total 59 cases

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Telangana has reported 10 more coronavirus positive cases on Friday taking the total positive cases to 59 persons, Chief Minister K Chandrashekhar Rao announced addressing a press conference.

తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడగింపు

Posted: 03/27/2020 08:28 PM IST
Coronavirus telangana reports 10 positive cases in a day total 59 cases

తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో వుండగా, ఒక్క రోజులో పది పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒక వ్యక్తికి నయమైందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభణపై ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, గృహనిర్బంధంలో కానీ ఉన్నారని, వీరి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

కరోనా నిరోధక చర్యల్లో ప్రజల సహకారాన్ని సీఎం ప్రశంసించారు. ప్రజలు సహకరించకుంటే కరోనా విస్ఫోటనం చెందేదని, జరిగే నష్టాన్ని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధో, అర్థం చేసుకుంటే అంత సింపుల్ వ్యాధి అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదని, వ్యాప్తిని నిరోధించడమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. కరోనాపై సరైన నివారణ చర్యలు తీసుకోని ఫలితంగా అన్ని వసతులు ఉన్న అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆగమాగం అయిపోతోందని తెలిపారు.

 మనదేశంలో సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు ఏకైక మార్గమని పేర్కొన్నారు. చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలో ప్రబలితే 20 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాంట్లో మనం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు ఎవరూ అతీతులు కారని, ఈ విపత్తు సమయంలో స్వీయరక్షణే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు. అయితే, కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీతో కూడా మాట్లాడానని, ఆయన కూడా అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారని వెల్లడించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ నెల 31 వరకూ అమలులో ఉన్న లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రజలంతా నిబంధనలు పాటిస్తే, వైరస్ ను పారద్రోల వచ్చని ఆయన అన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలవుతోందని వ్యాఖ్యానించిన ఆయన, ఇదే స్ఫూర్తిని మరో 20 రోజులు చూపాలని ప్రజలను కోరారు. కరోనా వైరస్ పై మంత్రులు, అధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఇప్పటికే 1,400 ఐసీయూ బెడ్స్, 11 వేలకు పైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, మరో 500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, 12,400 మందికి క్రిటికల్ కేర్ అవసరమైనా ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. 60 వేల మంది బాధితులు ఒకేసారి వచ్చినా ట్రీట్ మెంట్ ఇచ్చేంత సామర్థ్యం వైద్య శాఖకు ఉందని తెలిపారు. గచ్చిబౌలీ స్టేడియంలోనూ ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పదవీ విరమణ చేసిన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించాలని తాను ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు సూచించానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles