Discrepancies in Monitoring Indians Returning From Abroad ఆపద ముంచుకొస్తోంది: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Centre pulls up states for discrepancies in monitoring indians returning from abroad

airport coronavirus screening,cabinet secretary rajiv Gauba,China coronavirus,coronavirus,coronavirus in india,coronavirus screening,covid 19,gauba,health advisory,home quarantine,india coronavirus screening,india health advisory, rajeev gauba,Rajiv Gauba,screening passengers,screening passengers coronavirus,self isolation,self quarantine,social distancing

Ringing alarm bells, the Centre has pulled up state governments for not monitoring all Indian citizens who have returned from abroad in the past two months, stating that this could “seriously jeopardise” efforts to combat the spread of the coronavirus.

ఆపద ముంచుకొస్తోంది: రాష్ట్రాలకు క్యాబినెట్ సెక్రటరీ హెచ్చరిక

Posted: 03/27/2020 05:42 PM IST
Centre pulls up states for discrepancies in monitoring indians returning from abroad

విదేశాల నుంచి భారత్ కు వచ్చిన స్వదేశీ ప్రయాణికులతో దేశానికి ఆపద ముంచుకొస్తోందని.. కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. గత రెండు నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై మరింత నిఘాతో పర్యవేక్షించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ఇప్పటికే రాష్ట్రాల నుంచి అందిన గణంకాలకు, నిఘా పర్యవేక్షణలో వున్న ప్రయాణికుల జాబితాకు మధ్య వత్యాసం వుందని, ఇది ఇలాగే కొనసాగితే దేశానికే అపద ముంచుకొచ్చే ప్రమాదం వుందని ఆయన ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసారు.

విదేశాల నుంచి వచ్చిన వారందరూ ఇప్పుడు నిఘాలో లేరన్న అనుమానాన్ని రాజీవ్ గౌబా వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, నిఘాలో ఉన్న వారి సంఖ్యకూ తేడా ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈ కారణంతో ఘోర ఆపద ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ వ్యత్యాసం విఘాతం కలిగించేలా ఉందని హెచ్చరించిన రాజీవ్ గౌబా, వారిపై మరింత దృష్టిని సారించాలని అన్నారు. వైరస్ ను అరికట్టాలంటే, ఫారిన్ నుంచి వచ్చిన అందరినీ క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని సూచించారు.

కాగా, ఇమిగ్రేషన్ విభాగం అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు అందాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలుమార్లు అప్రమత్తం చేసింది. అందరిపైనా నిఘా ఉందని అధికారులు అంటున్నా, పలువురు క్వారంటైన్ స్టాంపులతో బయట తిరుగుతూ ఉండటం, కొన్ని చోట్ల బయటకు వచ్చిన వారిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles