Covid-19 count crosses 850-mark దేశవ్యాప్తంగా 851కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates cases in india climb to 851 death toll at 20

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Italy, Spain, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The death toll due to Covid-19 rose to 20 in India and around 136 fresh cases were reported on Friday, pushing the tally past the 850-mark. The Union health ministry has, meanwhile, asserted that the rate of increase in the positive cases was "relatively stable" in India.

కరోనా కరాళ నృత్యం: దేశంలో 851 మందికి కరోనా పాజిటివ్.. 20 మరణాలు

Posted: 03/27/2020 09:23 PM IST
Coronavirus updates cases in india climb to 851 death toll at 20

యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణమృదంగం మ్రోగిస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రారంభంలో మన దేశంలో గణనీయంగా అత్యత తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా అధిక సంఖ్యలో పెరగడం తీవ్ర అందోళన రేకెత్తించే అంశం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు. కాగా, భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 మరణాలు సంభవించాయి. ఇక ఇవాళ అత్యధికంగా 39 కరోనా పాజిటివ్ కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. వీరిలో 34 మంది కాసర్ ఘడ్ జిల్లాకు చెందినవారే కావడం విచారకరం.

మహారాష్ట్రలో ఇవాళ తాజాగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఆరుగురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా, నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారితో అత్యంత సన్నిహితంగా మెలిగినవారు. రాష్ట్రంలో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒక వ్యక్తికి నయమైందని తెలిపారు. ప్రస్తుతానికి 58 కరోనా బాధితులున్నారని, ఇవాళ ఒక్కరోజే 10 కేసుల్లో కరోనా నిర్ధారణ అయిందని అన్నారు. మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, గృహనిర్బంధంలో కానీ ఉన్నారని, వీరి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అటు ఏపీలోనూ ఇవాళ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  COVID-19 news  Coronavirus news  coronavirus hit countries  Italy  Europe  Spain  India  

Other Articles