AP High court stays GO over shifting Vigilance wing to Kurnool హైకోర్టు మొట్టికాయలతో ఏపీ కార్యలయాల తరలింపుకు బ్రేక్

High court snubs government s plan to shift some offices out of amaravati

AP High court, amaravati offices, YSRCP Government, AP Government, CM YS Jagan, chief secretary, Nilam Sawhney, Amaravati, Kurnool, kondepati giridhar, tirupathi rao, Andhra pradesh, Politics

The Andhra Pradesh High Court on Friday hurdled the YS Jaganmohan Reddy government’s steps to shift offices of the crucial vigilance and enforcement commissioners from Amaravati to Kurnool. The HC suspended a January 1 order issued by chief secretary Nilam Sawhney for relocating the offices on administrative grounds.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. కార్యలయాల తరలింపుకు బ్రేక్

Posted: 03/20/2020 11:32 AM IST
High court snubs government s plan to shift some offices out of amaravati

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం మరోమారు మొట్టికాయలు వేసింది. అమరావతిలోని కార్యాలయాలను తరలించేందుకు వీలు లేదంటూ గతంలో ాదేశాలను జారీ చేసిన న్యాయస్థానం మరోమారు అదే తరహా అదేశాలను జారీ చేయాల్సి వచ్చింది. అమరావతి నుంచి విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుండి కర్నూలుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు కార్యాలయాల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం సస్సెండ్ చేసింది.

విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్‌, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పరిపాలన సౌలభ్యం కోసం అన్ని అంశాల్ని పరిశీలించి కార్యాలయాలు కర్నూలుకు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాల నిర్వహణకు తగినంత స్థలం లేకపోవడం వల్ల వాటిని కర్నూలుకు తరలిస్తున్నామని ఏజీ తెలిపారు. ఆ రెండు సంస్థలు స్వతంత్రమైనవని, వాటి కార్యాలయాల ఏర్పాటు అంశం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గతంలో విచారణ సందర్భంగా ఏజీ చెప్పారు. దురుద్దేశంతో కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇటీవలే వాదనలు మగిసినప్పటికీ తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం ఈమేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles