MP political crisis: Kamalnath resigns as CM of Madhya Pradesh మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా

Madhya pradesh crisis kamalnath resigns as cm after approval of 16 rebel mla s resignations

Kamalnath, madhya pradesh CM, MP CM kamalnath, MP CM Kamalnath resigns, Digvijay Singh, Congress MLAs, Madhya Pradesh Government, Madhya Pradesh Crisis, MP Floor Test, Supreme Court, Madhya Pradesh Crisis Updates

Slamming the BJP for destabilising the MP government, CM Kamal Nath resigned on Friday ahead of the trust vote in the state assembly, ending a 15-month-old Congress rule in the state. Kamal Nath's government lost majority after the resignation on 22 MLAs, who are in support of Jyotiraditya Scindia, who recently moved to the BJP.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా

Posted: 03/20/2020 12:21 PM IST
Madhya pradesh crisis kamalnath resigns as cm after approval of 16 rebel mla s resignations

మధ్యప్రదేశ్‌ లో అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను అమోదించడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం మైనారిటీలోకి జారిపోయింది. దీంతో బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ‘‘15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచార’’ని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించామని అయితే.. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపి అన్ని ప్రయత్నాలు చేసిందని అరోపించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం బీజేపికి నచ్చలేదని కమల్‌నాథ్‌ విమర్శించారు.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కమల్‌నాథ్‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

జ్యోతిరాధిత్య సింధియా వెంటే తాము ఉంటామని ఎమ్మెల్యేలు కమల్ నాథ్ సర్కారుకు సంకేతాలు పంపించడంతో తొలుత వారిలో ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు. కాగా బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ బీజేపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5గంటల వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో బీజేపి సర్కారు ఏర్పడినా వీరంతా మళ్లీ అసెంబ్లీకి వెళ్లాళంటే మరోమారు ప్రజల్లోకి వెళ్లాల్సిందే.


మధ్యప్రదేశ్ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు:

మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య: 228
ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ
అదనంగా 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం
తాజాగా మద్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య: 206
బలపరీక్షలో పార్టీలకు కావాల్సిన సంఖ్యబలం: 104
బీజేపీ సభ్యుల సంఖ్య: మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles