NASA Spots 4 Asteroids Headed For Earth This Weekend హైకోర్టు మొట్టికాయలతో ఏపీ కార్యలయాల తరలింపుకు బ్రేక్

Giant potentially hazardous asteroid will fly safely by earth in april

Skywatching, asteroids, potentially hazardous asteroids, asteroid 1998 OR2, earth encounter with asteriod, harzardous asteriod

A large and "potentially hazardous" asteroid is poised to fly by Earth next month, but don't worry — it poses no threat to Earth. Asteroid (52768) 1998 OR2 will make a close approach to Earth on April 29. The hefty space rock has an estimated diameter of 1.1 to 2.5 miles (1.8 to 4.1 kilometers), or about the width of the isle of Manhattan.

భూమితో గ్రహశకలం ఎన్ కౌంటర్ ఉంటుందా.? నాసా ఏం చెబుతోంది..

Posted: 03/20/2020 10:49 AM IST
Giant potentially hazardous asteroid will fly safely by earth in april

ఓ వైపు కరోనా వైరస్ వ్యాధి భూమిపై మానవుడి మనుగడకు సవాల్ విసురుతూ.. వేలాది ప్రాణాలను బలితీసుకుంటున్న తరుణంలో ఈ ఏడాదిలోనే భూగ్రహంపై జీవిరాశీ అన్నది అంతం కానుందా.? అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఈ విషయాన్ని మూడేళ్ల  క్రితం 2020లో భూమి అంతం కానుందని, ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందంటూ ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద గ్రహశకలం ఈ ఏప్రిల్‌ 19న భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గతంలో వెల్లడించింది. అయితే, ఆ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందన్నది ఆ ప్రచార సారాంశం. ఇందులో నిజమెంత..?

ఏప్రిల్‌ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందని మూడేళ్ల క్రితం నాసా వెల్లడించింది. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం (స్పేస్‌రాక్‌) భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని ఓ వార్త సంస్థ తెలిపింది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందని పేర్కొంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఇలాంటి గ్రహశకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లాయి. ఇంతవరకు భూమికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.

అయితే, ఈ గ్రహశకలం పరిమాణం వాటన్నింటికంటే చాలా పెద్దది. 2004 సెప్టెంబర్‌లో ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత గల టౌటాటిస్‌ అనే గ్రహశకలం ఒకటి భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనర్‌- చంద్రుడి నుంచి భూమికి మధ్య గల దూరం)తో దూసుకెళ్లింది. రాబోయే గ్రహశకలం టౌటాటిస్‌ కంటే కూడా పెద్దది. గడిచిన 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదే అని నాసా పేర్కొంది. దీంతో ఆ గ్రహశకలం భూమికి తాకుతుందని, ఆ తర్వాత భూగ్రహం అంతమవుతుందని వార్తలు వ్యాపించాయి. అయితే, ఏప్రిల్‌ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు ద్వారా ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని నాసా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles