Unnao rape kuldeep sengar gets 10 years in jail for death of victim's father ఉన్నావ్ కేసులో కులదీప్‌ సెంగార్ కు పదేళ్ల జైలు

Unnao rape kuldeep sengar gets 10 years in jail for death of victim s father

unnao rape case, unnao rape, kuldeep sengar, kuldeep singh sengar, IMPRISONMENT, disciplinary action, doctors, Kuldeep Singh Sengar, jail term, imprisonment, Unnao Case, Delhi,court, Uttar Pradesh, Crime

Expelled BJP lawmaker Kuldeep Singh Sengar has been sentenced to ten years in jail and fined Rs 10 lakh in connection with the death of the Unnao rape victim's father. All other convicts have also been given 10-year jail terms

ఉన్నావ్ కేసులో బీజేపి మాజీ నేతకు పదేళ్ల జైలు

Posted: 03/13/2020 07:04 PM IST
Unnao rape kuldeep sengar gets 10 years in jail for death of victim s father

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఉన్నావ్ బీజేపి మాజీ ఎమ్మెల్యే అయిన కులదీప్‌ సెంగార్ తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్ తో పాటు ఆయన సోదరుడు అతుల్‌ సెంగార్ ను రూ.10లక్షలు చొప్పున బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ ఆదేశించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ కు చెందిన ఓ మైనర్ యువతిపై 2017లో అత్యాచారం చేసిన కేసులో బీజేపి ఎమ్మెల్యేగా ఎన్నికైన స్థానిక నేత కులదీప్‌ సెంగార్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసు విచారణలో ఉండగా పోలీస్‌ కస్టడీలో బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్ 9న మృతి చెందాడు. మైనర్ బాలికను అత్యాచారం చేసి.. న్యాయంకోసం పోరాడుతున్న కేసులో తండ్రిని పోలిస్ స్టేషన్ కు తీసుకువచ్చి.. కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దారుణంగా కొట్టడంతో ఆయన ప్రాణాలను కోల్పోయాడు. ఇంత జరిగినా కేసు పెట్టకుండా పోలీసులు బాధితురాలిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రి అధిత్యనాథ్ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడంలో అసలు విషయం మీడియాకు తెలిసింది.

ఈ ఘటనలో సెంగార్‌, ఆయన సోదరుడు, ఇద్దరు పోలీసు అధికారులు సహా మొత్తం ఏడుగురిని మార్చి 4న కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఉన్నావ్‌ అత్యాచారం కేసు ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. 2018లో ఓ కేసులో అరెస్టయిన తండ్రి కస్టడీలో మరణించాడు. దీంతో పాటు ఉన్నావ్‌ బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు కారులో వెళుతుండగా వారిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను సైతం బాధితురాలు కోల్పోయింది. ఆమె ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ సంరక్షణలో ఉంటోంది. గతేడాది డిసెంబర్‌ 20న అత్యాచారం కేసులో సెంగార్‌కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles