government reopens forgery case against Scindia జ్యోతిరాదిత్య సింధియాకు కమల్ నాథ్ సర్కార్ షాక్..

Kamal nath government reopens forgery case against former congress leader

Madhya Pradesh Political crisis, Madhya Pradesh government formation, Kamal Nath, Chief Minister Kamal Nath, Jyotiraditya Scindia, Jyotiraditya Scindia, BJP Jyotiraditya Scindia leaves Congress, Madhya Pradesh news, Kamal Nath, Chief Minister, Governor, Lalji Tandon, Jyotiraditya Scindia, BJP, Bengaluru, Madhya Pradesh, Politics

The Madhya Pradesh Economic Offences Wing (EOW) decided to verify facts afresh in a complaint against former Union minister Jyotiraditya Scindia and his family, where they are accused of falsifying a property document while selling land.

జ్యోతిరాదిత్య సింధియాకు కమల్ నాథ్ సర్కార్ షాక్..

Posted: 03/13/2020 08:01 PM IST
Kamal nath government reopens forgery case against former congress leader

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఆయన మీద పెండింగ్ లో ఉన్న ఓ ఫోర్జరీ కేసులో వాస్తవాలను విచారించాలని మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు సింధియాపై గతంలో నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విచారణకు అదేశించింది. ఈ కేసులో వాస్తవాలను వెలికి తీయాలని అదేశిస్తూ ఈఓడబ్యూకు అదేశించింది. అయితే ఈ కేసును తాజా పరిణామాల నేపథ్యంలో విచారణకు అదేశించడం కేవలం రాజకీయ కుట్ర అని సింధియా వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.

ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళ్తే.. గతంలో సింధియా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మహాల్గావ్ లో ఓ భూమిని పత్రాల్లో ఉన్న దాని కంటే 6,000 చదరపు అడుగులు తక్కువగా చూపి తనకు విక్రయించారని సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మార్చి 26, 2014న సింధియా, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేశాడని ఈఓడబ్ల్యూ తెలిపింది. అయితే ఆ కేసులో విచారణను 2018లో నిలిపివేశారు. తాజాగా ఈ కేసును విచారించాలని శ్రీవాస్తవ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాస్తవాలను విచారించాలని తమకు ఆదేశాలు అందాయని ఈఓడబ్ల్యూ అధికారి ఒకరు తెలిపారు.

దీనిపై సింధియా సహాయకుడు పంకజ్‌ చతుర్వేది మాట్లాడుతూ ‘‘ఇది రాజకీయ కుట్ర. కేవలం ప్రతీకారం కోసమే ఈ కేసును తిరిగి తెరిచారు. మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. దీనికి కమల్ నాథ్‌ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి’’ అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బీజేపి చేరారు. పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే బీజేపి ఆయన్ను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం కష్టాల్లో పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Nath  Chief Minister  Governor  Lalji Tandon  Jyotiraditya Scindia  BJP  Bengaluru  Madhya Pradesh  Politics  

Other Articles