Kamal Nath requests Governor to hold floor test బడ్జెట్ సమావేశాల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటాం: కమల్ నాథ్

Madhya pradesh political crisis cm kamal nath meets governor lalji tandon

Madhya Pradesh | Madhya Pradesh Political crisis | Madhya Pradesh government formation | Kamal Nath | Chief Minister Kamal Nath | Jyotiraditya Scindia | Jyotiraditya Scindia BJP | Jyotiraditya Scindia leaves Congress | Madhya Pradesh news, Kamal Nath, Chief Minister, Governor, Lalji Tandon, Jyotiraditya Scindia, BJP, Bengaluru, Madhya Pradesh, Politics

Madhya Pradesh Chief Minister Kamal Nath is meeting Governor Lalji Tandon in the midst of political crisis in the state triggered by the resignation of 22 rebel Congress MLAs. It has alleged that 19 of the rebel Congress MLAs, including ministers, have been held "captive" by the BJP in a resort in Bengaluru.

బడ్జెట్ సమావేశాల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటాం: కమల్ నాథ్

Posted: 03/13/2020 06:10 PM IST
Madhya pradesh political crisis cm kamal nath meets governor lalji tandon

మధ్యప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో త్వరలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో బల పరీక్షకు తాము సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. తమ అధికార పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్ని బీజేపి నిర్బంధించిందని ఆరోపించారు. ఇది రాజకీయాల్లో కరోనా కంటే భయానం వాతావరాన్ని సృష్టిస్తోందని అరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ లాల్జీ టండన్ ను కలసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరించారు. ఈ సందర్భంగా మూడు పేజీల లేఖను గవర్నర్ కు ఆయన అందజేశారు.

మధ్యప్రదేశ్ లో బీజేపి వ్యవహరిస్తున్న తీరును  తప్పుపడుతూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపి గతం నుంచి ప్రయత్నాలు చేస్తోందనీ.. అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని లేఖలో మండిపడ్డారు. కొందరు మంత్రులతో పాటు కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను బీజేపి బంధించిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులతో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని, గవర్నర్‌ కార్యాలయం జోక్యం చేసుకొవాలని ఆయన కోరారు. నిర్బంధంలో ఉన్న తమ ఎమ్మెల్యేలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

మరోవైపు, తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను బీజేపి.. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉంచిందంటూ గతం నుంచి కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుండగా.. బీజేపి నేతలు తిప్పికొడుతున్నారు. మరోవైపు సింధియాకు మద్దతుగా రాజీనామా చేసిన మంత్రులతో సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఈ నెల 16 నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Nath  Chief Minister  Governor  Lalji Tandon  Jyotiraditya Scindia  BJP  Bengaluru  Madhya Pradesh  Politics  

Other Articles