Man held on house breaking and theft charges యాచకుల ఇంటికి కన్నమేసిన దొంగ.. రూ.3 లక్షల చోరీ

Man held on house breaking and theft charges in handicapped couple house

nagaraju, saraswati, handicapped couple, theft, gold, cash, ramanjaneyulu, pamidi, pamidi police, ananthapuram, andhra pradesh, crime

A young man has been caught on house breaking and theft charges after he allegedly stole three lakh rupees worth gold ornaments and Rs 2 lakh cash from a physically handicapped couple house in pamidi of anantapur district.

యాచకుల ఇంటికి కన్నమేసిన దొంగ.. రూ.3 లక్షల చోరీ

Posted: 02/26/2020 11:35 AM IST
Man held on house breaking and theft charges in handicapped couple house

ఆ దంపతులు దివ్యాంగులు. అయినా భవిష్యత్తు మీద ఆశతో.. వృద్దాప్యంలో తమను చూసుకోవడానికి ఎవరు సాయం చేయాలన్నా.. లేక ఏ వైద్యం కోసం.. ఇక ప్రస్తుతం తమ జీవనం సాగాలన్న డబ్బు అవసరమని.. తమకు ఉపాధి లభించకపోవడంతో భిక్షాటన చేసుకునే జీవినం సాగిస్తున్నారు. అలాంటివారి ఇంటినే టార్గెట్ చేసిన వీరముష్టి దొంగ.. ఇంట్లోకి చోరబడి రూ.3 లక్షల సొత్తు చోరీ చేశాడు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి సహకరించిన మైనర్ బాలుడ్ని కూడా అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.

పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా పమిడికి చెందిన దంపతులు నాగరాజు, సరస్వతి దివ్యాంగులు. ఉపాధి కోసం తిరిగినా ఎక్కడా లభించకపోవడంతో హైదరాబాద్ లో భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఆ నగరంలో యాచనతో సంపాదించిన మొత్తాన్ని ప్రతి ఇరవై రోజులకోసారి సొంతూరు పమిడి వచ్చి తమ ఇంట్లోని బీరువాలో భద్రపరిచేవారు. ఈ విధంగా మూడు లక్షలు కూడబెట్టారు. ఓ ఇరవై ఐదు గ్రాముల బంగారం కూడా కొని దాచుకున్నారు. ఈ ఇంట్లో నాగరాజు తల్లి నారాయణమ్మ మాత్రమే ఉంటోంది.

ఈ విషయాన్ని నిందితుడు రామాంజనేయులు గమనించాడు. నారాయణమ్మ డిసెంబరు 10న ఓ వివాహానికి వెళ్లిందని తెలుసుకున్న రామాంజనేయులు ఓ బాలుడితో కలిసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరించాడు. పెళ్లి నుంచి తిరిగి వచ్చిన నారాయణమ్మ చోరీ జరిగిందని గుర్తించి కొడుక్కి చెప్పడంతో డిసెంబరు 22న నాగరాజు పమిడి వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత 3 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం అని ఫిర్యాదుచేసి తర్వాత లక్ష ఉందని, 2 లక్షల నగదే పోయిందని పోలీసులకు తెలిపాడు. కేసు విచారిస్తున్న పోలీసులకు ఓ బాలుడు బంగారం తాకట్టు పెట్టుకుంటావా? అని పలువురిని అడుగుతున్నట్లు సమాచారం అందింది.

దీంతో నిఘా పెట్టన పోలీసులు బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించి.. నిందితుడు రామాంజనేయులును పెన్నానది ఒడ్డున ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద అదుులోకి తీసుకున్నారు. అప్పటికే 2 లక్షల నగదులో నిందితుడు రూ.40 వేలు ఖర్చు చేసేశాడు. తనకు సహకరించిన బాలుడికి రూ.10 వేలు ఇచ్చాడు. దీంతో మిగిలిన రూ.1.50 లక్షల నగదు, 25 గ్రాముల బంగారాన్ని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రామాంజనేయులుని జైలుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagaraju  saraswati  handicapped couple  theft  gold  cash  ramanjaneyulu  pamidi  pamidi police  ananthapuram  andhra pradesh  crime  

Other Articles