Revanth reddy demands to allocate double bedroom houses ‘పేదల ఇంటి అద్దెలను ప్రభుత్వం చెల్లించాలి..’

Revanth reddy demands to allocate or pay rents of double bedroom benificaries

Revanth Reddy, Patnam Gosa, TRS poll promises, KCR government, double bedroom houses, Rajiv swagruha houses, Bandlaguda, LB Nagar Assembly, Hyderabad, GHMC elections, Prime Minister Awas Yojana, G Kishan Reddy, Telangana, Politics

MP Revanth Reddy demands Telangana Government to pay rents of poor people who are eligible for for Double Bed Room Houses in Hyderabad city.

‘లబ్దిదారుల ఇంటి అద్దెలను ప్రభుత్వం చెల్లించాలి..’: ఎంపీ రేవంత్ రెడ్డి

Posted: 02/26/2020 12:29 PM IST
Revanth reddy demands to allocate or pay rents of double bedroom benificaries

ఎన్నికల సమయంలో పేదలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపి.. డబుల్ బెడ్ రూమ్ ఆశ కల్పించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వున్న పేదలను నిట్టనిలువునా మోసం చేసిందని మల్కాజ్ గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే గత ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పి ప్రకటించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పటికీ కేటాయించని కారణంగా.. లబ్దిదారులుగా రాష్ట్రంలోని పేదలందరీ ఇంటి అద్దెలను ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎవరికి కేటాయిస్తారో చెప్పకుండా నిర్మించే ఇళ్లపై పేదలందరిలోనూ ఆశలు రేపిన ప్రభుత్వం వారి అద్దెలను చెల్లించాలని లేదా వారికి ప్రతినెల రూ.5 వేలను అద్దెలు చెల్లించేందుకు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇప్పటి వరకు లబ్దిదారులకు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజీవ్‌ స్వగృహ ఎండీని కోరారు. లేనిపక్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా వుండాలే కాని, పాలకులకు కాదని ఆయన హితువు పలికారు.

‘పట్నం గోస’ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రభుత్వ పట్టణ ప్రగతి కార్యక్రమంతో మరోమారు మీ ముందుకు రాబోతుందని, అయితే గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటని ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు మీకు వర్తిస్తున్నాయో అలోచించాలని కూడా రేవంత్ ప్రజలకు సూచించారు. కేవలం మాయల మరాఠీ మాటల్లో పడో.. లేక ఆశల వలయంలో చిక్కుకునో మీ భవిష్యత్తును, మీ వారసుల భవిష్యత్తును పన్నంగా పెట్టవద్దని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన బండ్లగూడలో రాజీవ్‌ స్వగృహ ఇళ్లను పరిశీలించారు. దాదాపు 3000 ఇళ్లను అర్హులకు ఎందుకు కేటాయించలేదని రాజీవ్‌ స్వగృహ ఎండీని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన్ను రేవంత్‌ కోరారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్లకు తాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న రేవంత్‌.. వెంటనే మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు అందజేయనున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. దీనివల్ల పేదలు అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles