Delhi CAA violence toll rises to 20 పౌరులను చంపుతున్న సవరణ చట్టం.. 20 మంది మృతి..

Delhi violence police unable to control situation deploy army says cm kejriwal

CAA,anti-citizenhship amendment act, protests, maujpur, delhi, northeast delhi, pro-CAA, DMRC, Delhi metro, clash, tear gas, kapil Gujjar, Shaheen Bagh, shooter, links, aap, delhi police, father gaje singh, lok sabha, aam admi party, delhi elections, jamia firing, jamia millia university, caa, delhi, delhi police, shaheen bagh, gunman, firing at jamia, jamia university firing, jamia millia islamia, Jamia Firing, jamia millia University, Firing, Gate no 5, CAA protest, Anti CAA protest, Politics

Delhi Chief Minister Arvind Kejriwal on Wednesday said that the city police was unable to control the situation in the national capital and Army should be deployed. “I have been in touch wid large no of people whole nite. Situation alarming. Police, despite all its efforts, unable to control situation and instil confidence. Army shud be called in and curfew imposed in rest of affected areas immediately. Am writing to Hon’ble HM to this effect,” he tweeted.

పౌరులను చంపుతున్న సవరణ చట్టం.. 20 మంది మృతి..

Posted: 02/26/2020 10:42 AM IST
Delhi violence police unable to control situation deploy army says cm kejriwal

పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత పార్లమెంటు అమోదించిన నేపథ్యంలో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ.. గత రెండు నెలలుగా శాంతియుతంగా చేపట్టిన నిరసనలు సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన రోజున ఉగ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఆల్లర్లు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ అల్లర్లలో రాత్రి వరకు 13 మంది మరణించగా, ఇవాళ ఉదయం మరో ఏడుగురి మృత్యుఒడిలోకి చేరడంతో మొత్తంగా 20మంది మరణించారు. వందల మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో వందకుమించిన సంఖ్యలో పోలీసులే వుండటం గమనార్హం.

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఈశాన్య ఢి్ల్లీలోని మౌజ్‌పూర్‌, బ్రహ్మపురి, సీలంపూర్, గోకుల్పూరీ సహా పలు ప్రాంతాల్లో తొలుత 144 సెక్షన్ విధించిన అధికారులు.. అల్లర్లు తగ్గకపోవడంతో కనిపస్తే కాల్చివేత అదేశాలను జారీ చేశారు. గోకుల్ పూరీలో ఓ దుకాణాన్ని అందోళనకారులు నిప్పుపెట్టారు. దేశరాజధానిలో చెలరేగిన హింసపై ఢిల్లీ హైకోర్టు కూడా అందోళన వ్యక్తం చేసింది. అర్థరాత్రి వేళ.. కేసు ఎమర్జెన్సీ కింద పోలీసులకు పలు అదేశాలను జారీచేసిన న్యాయస్థానం వారికి నోటీసులు కూడా జారీ చేసింది.

గాయాలపాలైన క్షతగాత్రులను వెనువెంటనే అసుపత్రులకు తరలించాలని అదేశాలను ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన అర్జెంటు పిటీషన్ ను న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మధుకర్ ఈ మేరకు అదేశాలను వెలువరించారు. గాయపడిన వారికి సూపర్ స్పెషాలిటీ అసుపత్రులకు లేదా అత్యాధునికి చికిత్సా విధానాలు సధుపాయాలు కలిగిన అసుపత్రులకు తరలించి చికిత్స అందించాలని సూచించారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని మోహరించినప్పటికీ.. వారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అందోళనలు హింసాయుతంగా మారుతున్నాయని ఈ నేపథ్యంలో పోలీసులకు బదులు రంగంలోకి ఆర్మీని దింపాలని ఢి్ల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.

నిన్న రాత్రి తాను అనేక మంది స్థానికులతో రాత్రంతా అందుబాటులో వున్నానని.. ఈశాన్య ఢిల్లీ ప్రాంతవాసులు, అధికారులు, ఎమ్మెల్యేలతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే వున్నానని, అయినా పరిస్థితి అందోళనకరంగానే వుందని ఆయన అన్నారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రాలేదంటే.. ఇక పోలీసుల వల్ల కాదని, ఆర్మీని రంగంలోకి దించాల్సిందేనని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. నిరసనకారుల అందోళనల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు అందోళనకారులు నిప్పు పెట్టారు. పెట్రోల్‌ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles