NVS Reddy key statements on HMRL extension మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన

Nvs reddy key statements on hyderabad metro rail second phase and routes

hyderabad metro rail, metro rail second phase, DPR, KTR, CM KCR, light rail, mono rail, ppp, BHEL, Hafizpet, Kondapur, RGIA, Raidurg, LB Nagar

hyderabad metro rail managing director NVS Reddy had made key statements on second phase routes and extensions of metro rail. He said that DPR of the new 62 kms has been submitted to Government.

మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన

Posted: 02/25/2020 08:59 PM IST
Nvs reddy key statements on hyderabad metro rail second phase and routes

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెట్రో రెండు దశలో భాగంగా.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు మెట్రో రైలు సేవలను విస్తరించడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. మూడు కారిడార్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలుతో అనుసంధానించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

నూతన మార్గాలివే..

రెండో దశలో భాగంగా.. ముందుగా రాయదుర్గం నుంచి ఆర్జీఐఏకు 31 కి.మీ. మేర నూతన మార్గం నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం పశ్చిమం నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేస్తోందని, దీంతో పాటు నాగోల్ నుంచి ఆర్జీఐఏ మరో మార్గం కనెక్ట్ చేస్తోందని అన్నారు, ఇక నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మార్గం విస్తరించాలని, అలాగే మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్ వరకు విస్తరించాల్సి వుందన్నారు. ఇక బిహెచ్ఇఎల్ నుంచి ఆల్విన్ ప్రధాన కూడలి, హఫీజ్ పేట్, కొండాపూర్, పాత ముంబై హైవే రోడ్డు మీదుగా లక్డీకాపూల్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు.

పాతబస్తీలో 5 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో కారిడార్ -2లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఇటీవలే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఫలక్‌నుమా వరకు మరో 5 కి.మీ. మేర నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో మార్గం ప్రారంభంతో హైదరాబాద్ మెట్రో నయా రికార్డులు నెలకొల్పుతోంది. ఈ మార్గం ప్రారంభంతో మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ మెట్రోకి రోజుకి రూ. కోటి ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 16 కోట్ల మందికి పైగా మెట్రోలో ప్రయాణించారని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad metro rail  metro rail second phase  DPR  KTR  CM KCR  light rail  mono rail  ppp  BHEL  Hafizpet  Kondapur  RGIA  Raidurg  LB Nagar  

Other Articles