IRCTC Archanam Tour Train from Secundrabad to Tirumala ఐఆర్సీటీసీ అర్చనం టూర్.. సికింద్రాబాద్ నుంచి తిరుమల

Irctc archanam tour train from secundrabad to tirumala

IRCTC Archanam Tour Package, IRCTC Tirumala Tour Package, IRCTC Tirupati Tour Package, IRCTC Tirumala Tour from hyderabad, IRCTC tours from hyderabad, IRCTC Tours, South Central Railway, SCR, Tirumala, Sri kalahasti, sri puram, kanipakam, secundrabad, IRCTC Archanam Tour, Every Thursday, Padmavati Express

IRCTC Archanam Tour Train from Secundrabad to Tirumala, most affordable all inclusive tour package, covering all the important tourist places near Tirumala with Kanipakam, Sri Puram, Sri Kalahasti, Tiruchananur along with Tirumala

ఐఆర్సీటీసీ అర్చనం టూర్.. సికింద్రాబాద్ నుంచి తిరుమల

Posted: 02/25/2020 07:10 PM IST
Irctc archanam tour train from secundrabad to tirumala

తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'అర్చనం' పేరుతో ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతీ గురువారం హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. టూర్ ప్యాకేజీలో స్లీపర్ లేదా థర్డ్ ఏసీ ప్రయాణం, తిరుపతిలో ఏసీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

ఐఆర్‌సీటీసీ అర్చనం టూర్ ప్యాకేజీ వివరాలివే...

ఐఆర్‌సీటీసీ అర్చనం టూర్ ప్రతీ గురువారం ఉంటుంది. గురువారం సాయంత్రం 06:30 గంటలకు పద్మావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. శుక్రవారం ఉదయం 7:00 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్ కావాలి. 10:30 గంటలకు తిరుపతి నుంచి కాణిపాకం బయల్దేరాలి. 11:30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. 12:30 గంటల వరకు దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీపురం బయల్దేరాలి. మధ్యాహ్నం 02:00 గంటలకు శ్రీపురం చేరుకుంటారు. 03:45 గంటలకు దర్శనం చేసుకోవాలి. సాయంత్రం 04:00 గంటలకు శ్రీకాళహస్తి బయల్దేరాలి. రాత్రి 07:30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు. రాత్రి 08:30 గంటల వరకు దర్శనం చేసుకొని బయల్దేరాలి. రాత్రి 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.

శనివారం ఉదయం 08:00 గంటలకు హోటల్ లో చెకౌట్ చేసి తిరుమలకు బయల్దేరాలి. ఉదయం 09:30 గంటలకు తిరునమల చేరుకుంటారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 01:00 గంటలకు దర్శనం ముగుస్తుంది. 02:00 గంటల వరకు షాపింగ్ చేసుకొని తిరుపతి బయల్దేరాలి. మధ్యాహ్నం 03:30 గంటలకు తిరుపతి చేరుకుంటారు. సమయం ఉంటే తిరుచానూర్ ఆలయానికి తీసుకెళ్తారు. సాయంత్రం 05:00 గంటలకు తిరుపతిలో పద్మావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆదివారం ఉదయం 05:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ అర్చనం టూర్ ప్యాకేజీ ధరల వివరాలు ఇలా వున్నాయి. ఈ ప్యాకేజీని ఐఆర్సీటీసీ రెండు క్లాసుల్లో అందిస్తోంది. కంఫార్ట్ క్లాస్ మరియు ఎకానమి క్లాస్. కంపార్ట్ క్లాస్ ధర్డ్ ఏసీలో ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుండగా, ఎకానమి క్లాస్ లో స్లీపర్ క్లాస్ లో ప్రయాణాన్ని అందించనుంది ఐఆర్సీటీసీ. కంపార్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,050, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,830, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,620. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,120, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,900, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,690.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles