Nirbhaya Case: SC defers hearing of Centre’s appeal to March 5 నిర్భయ దోషులకు ఈ సారైనా శిక్ష అమలయ్యేనా.?

Nirbhaya case supreme court defers hearing of centre s appeal to march 5

Nirbhaya convicts, Execution, Justice Suresh Kait, Delhi High Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The Supreme Court deferred to March 5 the hearing of an appeal filed by the Centre for permission to separately execute the death sentence of the four Nirbhaya case convicts. A three-judge Bench led by Justice R. Banumathi was informed at the beginning of the session that the trial court had fixed the execution of the four convicts for March 3 at 6 a.m.

‘నిర్భయ’ కేసు: దోషులకు ఈ సారైనా శిక్ష అమలయ్యేనా.?

Posted: 02/25/2020 07:53 PM IST
Nirbhaya case supreme court defers hearing of centre s appeal to march 5

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే దోషులు శిక్షను తప్పించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించడంతో పాటు ఏకంగా తలను జైలు గోడలకేసి బద్దలు కొట్టుకుని.. వారు మానసికంగా ధృడంగా లేరన్న న్యాయస్థానాలను నమ్మించే ప్రయాత్నాలను కూడా చేస్తున్నారు. ఈ కేసులో దోషులు తమకు న్యాయపరంగా సంక్రమించే అన్ని హక్కులను, అవకాశాలను వినియోగించుకోవాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు అదేశించింది.

ఈ క్రమంలో దోషులకు వారం రోజుల వ్యవధిని కూడా ఇచ్చింది. ఈ లోగా నలుగురు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని కూడా స్పష్టం చేసింది. గడువు ముగియడంతో పటియాల కోర్టు మరోమారు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు మరో తేదీని కూడా వెలువరించింది. ఇదివరకే రెండు పర్యాయలు జనవరి 22, ఫిబ్రవరి 1.. రెండు పర్యాయాలు దోషులకు డెత్ వారెంట్ వాయిదా పడిన నేపథ్యంలో తాజాగా మార్చి 3న దోషులకు ఉరి శిక్ష విధించాలని డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇది కూడా అమలు జరిగకపోవచ్చునన్న అనుమానాలే వినిపిస్తున్నాయి.

దోషుల ఉరిశిక్ష అమలు చేయడానికి ఉద్దేశించిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి వేర్వేరుగా ఉరిశిక్ష ఉరిశిక్ష అమలు చేసేలా అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణను మార్చి 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఉరిశిక్ష అమలు మరోసారి నిలిచిపోయే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తూ.. ఈ సారి కూడా సాధ్యమయ్యేలా కనిపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు కాబట్టి.. మరణశిక్ష విధించే అవకాశలు వున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles