Delhi: Two killed in encounter with police పోలీసులపై దాడి చేసిన ఇద్దరు క్రిమినల్స్ ఎన్ కౌంటర్..

Two criminals killed in encounter in delhi

Two criminals, Raja Qureshi, Ramesh Bahadur, DCP PS Kushwah, Delhi police, encounter, Pul PehladPur, Badarpur, Special Cell Police, Delhi, Crime

Two alleged criminals were killed in an exchange of fire with the Special Cell of Delhi Police at Pul Pehlad Pur area here on Monday morning, officials said. The encounter took place around 5 am, they said.

పోలీసులపై దాడి చేసిన ఇద్దరు క్రిమినల్స్ ఎన్ కౌంటర్..

Posted: 02/17/2020 11:11 AM IST
Two criminals killed in encounter in delhi

దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ వేకువ జామున కాల్పుల కలకలం రేగింది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపు ఢిల్లీ పోలీసులు ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులను హతమార్చారు. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్ లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు దుండగులు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని పారిపోతున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు వారిని నడిరోడ్డుపైనూ మట్టుబెట్టారు. ఇద్దరు దుండగులను రఫీక్ అలియాస్ రాజా ఖురేషీ అలియాస్ రాజా ఫహీల్వాన్, రమేశ్ బహదూర్ లని పోలీసులు పేర్కోన్నారు.

వీరిద్దరూ ఢిల్లీలోని ప్రహ్లాద్ పూర్ లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందం వారిని గాలిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంది. వారిని చూసి అప్రమత్తమైన దుండగులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో నిందితులు ఇద్దరూ తీవ్రగాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన అసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

వేకువజాము ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు జరుగడంతో.. అసలేం జరుగుతుందో అర్థంకానీ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ పీఎస్ కుహ్వాహ్ మాట్లాడుతూ తాము నిందితులు కాల్పులు జరుగుతున్నా తాము.. కొంతసేపు సహనంతో వారిని లొంగిపోవాలని చెప్పామని అయినా వారు కాల్పులకు తెగబడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్లో తమ బలగాలే లైఫ్ ఫ్రూప్ జాకెట్లు ధరించడం వల్ల ఎలాంటి గాయలు కాలేదని ఆయన తెలిపారు.

కాగా మృతుడు రఫీక్ అలియాస్ రాజా ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన లోని ప్రాంతానికి చెందినవాడు కాగా, రమేష్ బహదూర్ మాత్రం ఢిల్లీలోని కరావాల్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్ కు చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ అనేక కేసుల్లో వాంటెండ్ జాబితాలో వున్నవారేనని అన్నారు. వీరిపై ఓ హత్యకేసు కూడా నమోదు అయ్యిందని అన్నారు. రఫీక్ అత్యంత కరుడుగట్టిన నేరస్థుడని, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఈ నెల 12 ఇద్దరు పోలీసులపై దాడి చేశారని కూడా డీసీపీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles