Air India offers domestic flight tickets starting from Rs 799 ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంఫర్ ఆఫర్

Air india kicks off flash sale with domestic flight tickets starting from rs 799

air india, air india discounts, air india flight ticket book online, air india flight tickets discount, air india flash sale, air india sale rs 799 tickets, air india sale rs 4500 sale, Business

Air India is here to make your travel plans feel lighter on your pockets with their lucrative flash sale. The airlines took to their website to announce their Amazing Air Fair in which they are giving discounts on their domestic and international flights.

ఎయిర్ ఇండియా బంఫర్ ఆఫర్.. రూ.799లకే దేశీయ టికెట్..

Posted: 02/15/2020 05:54 PM IST
Air india kicks off flash sale with domestic flight tickets starting from rs 799

విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ విమానయాన కంపెనీ ఎయిరిండియా తాజాగా ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.799 ప్రారంభ ధరకే అందిస్తోంది. అలాగే అంతర్జాతీయ విమాన టికెట్ల ధర రూ.4,500 నుంచి ప్రారంభమౌతోంది. ఇందులో భాగంగా డిస్కౌంట్ ధరకే టికెట్లు అందిస్తోంది.

కాగా ఎయిర్ ఇండియా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 15న ఈ ఆఫర్ ప్రారంభమైంది. మరో రెండు రోజులు అంటే ఫిబ్రవరి 17 వరకు టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ తగ్గింపు ధరల ఆఫర్ కేవలం ఎకానమీ క్లాస్ టికెట్లకు మాత్రమే వర్తి్స్తుంది. అలాగే దేశీ విమాన ప్రయాణంలో ప్రయాణించాలని భావించే వారికే ఈ రూల్ ఉంటుంది.

సౌదీ అరేబియా మినహా విదేశీ ప్రయాణం చేయాలని భావిస్తే.. ఆఫర్‌లో భాగంగా ఏ టికెట్‌ను అయినా బుక్ చేసుకోవచ్చు. కాగా ఎయిర్ ఇండియా ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ సీట్లు అందుబాటులో ఉన్నంత వరకే ఉంటుందని స్పష్టతనిచ్చింది. అందువల్ల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వారికే ఇది వర్తించొచ్చు. కాగా ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 18 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles