Montek: Singh mulled exit after Rahul jab రాహుల్ తీరుపై నోచ్చుకున్న మన్మోహన్: అహ్లూవాలియా..

Manmohan singh asked me if he should quit post rahul gandhi ordinance row montek singh ahluwalia

former Prime Minister Manmohan Singh, AICC top leader Rahul Gandhi, Montek Singh Ahluwalia book, Ahluwalia book Backstage, Rahul ordinance, Montek Ahluwalia, Rahul Gandhi, Manmohan Singh, Criminal politicians, convicted lawmakers, Supreme Court, National Politics

After the Rahul Gandhi ordinance-trashing episode of 2013, the then Prime Minister Manmohan Singh asked Montek Singh Ahluwalia whether he thought he should resign, the former Deputy Chairman of the now-defunct Planning Commission said.

రాహుల్ తీరుపై నోచ్చుకున్న మన్మోహన్: మంటెక్ సింగ్ అహ్లూవాలియా..

Posted: 02/17/2020 12:06 PM IST
Manmohan singh asked me if he should quit post rahul gandhi ordinance row montek singh ahluwalia

మాజీ ప్రధాని మహన్మోన్ సింగ్ కు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై కోపం వచ్చింది.. దీంతో అప్పట్లో ఆయన తన ప్రధాని పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకున్నారు.. ఇప్పుడీ మాటలను ప్రస్తావించారు అప్పటి ప్లానింగ్ కమీషన్ ఢిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. అంతేకాదు.. తనను రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో అవమానించారని.. కాంగ్రెస్ యువనేత తీరుతో మన్మోహన్ తెగ నోచ్చుకున్నారని కూడా ఆయన వెల్లడించారు. అయితే నచ్చజెప్పడంతో శాంతించిన మన్మోహన్ తన రాజీనామాపై మాత్రం వెనక్కుతగ్గారని కూడా చెప్పారు అహ్లూవాలియా.

ఈ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తోందని, 2013లో ఈ ఘటన జరిగిందని కూడా చెప్పారు అహ్లూవాలియా. అప్పట్లో రాహుల్ గాంధీ తీరుపై మన్మోహన్ సింగ్ అలిగారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ అత్యవసర జీఓను రాహుల్ గాంధీ చించివేయడంతో ఆయన ఈ ఆలోచన చేశారట. యూపీయే పాలననాటి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు ఇతివృత్తంగా అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రాసిన 'బ్యాక్ స్టేజ్ - ది స్టోరీ బిహైండ్ ఇండియాస్ హైగ్రోత్ ఇయర్స్'లో నాటి విషయాలను ప్రస్తావించారు.

నేరచరిత్ర కలిగిన ప్రజాప్రతినిదులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన అదేశాల నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఓ జీవోను తీసుకురావాలని యోచించింది. ఇందుకు అంతా సిద్దం చేసింది. అయితే ఓ కార్యక్రమంలో పాల్గోన్న రాహుల్ గాంధీని ఈ విషయమై అప్పట్లో మీడియా ఆయన స్పందనను కోరింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఇలాంటి చట్టాలు నాన్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. 'రాహుల్ చర్య అప్పట్లో సంచలనమైంది. తొలుత ఆర్డినెన్సు అంగీకరించిన నేతలు కూడా రాహుల్ దాన్ని చించి వేయగానే మాట మార్చారు.

ఇలాంటి చట్టాలను చించి పారవేయాలని కూడా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించారు. అయితే ఇది తన ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ అని.. దీంతో తాననే రాహుల్ అవమానించారని మన్మోహన్ సింగ్ భావించారని.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చించేయడం అంటే ప్రధాని కార్యాలయాన్ని అవమానించడమే అని కూడా విమర్శలు వచ్చాయని పేర్కోన్నారు. ఆ సమయానికి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అమెరికాలో ఉన్నారని కూడా వివరించారు.

ఈ ఘటను పురస్కరించుకుని విశ్రాంతి ఐఏఎస్ అధికారి సంజీవ్ ఓ వ్యాసం రాస్తూ మన్మోహనను తీవ్రంగా విమర్శించారు. మన్మోహన్ ప్రతిష్ఠ మసకబారుతోందని అభిప్రాయపడ్డారు. నా మిత్రుల్లో చాలామంది కూడా సంజీతో ఏకీభవించారు. నేనా వ్యాసాన్ని మన్మోహనకు చూపిస్తే 'ఇప్పుడు నేను రాజీనామా చేయడం మంచిది అంటారా' అని ఆయన అడిగారు. కానీ నేను అన్ని విధాలా ఆలోచించాక వద్దని సలహా ఇచ్చాను' అని ఆహ్లూవాలియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆహ్లూవాలిటీ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారన్న పేరుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles