తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ మరో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 'భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్'ను ప్రకటించింది. ఇటీవలే 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పేరుతో ఒక రైలు ప్రకటించిన ఐఆర్సీటీసీ తాజాగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు పర్యాటక ప్రాంతాల వీక్షణంతో పాటు పలు ప్రసిద్దిగాంచిన ఫుణ్యక్షేత్రాల దర్శించుకునే అవకాశాన్ని కూడా ఈ యాత్రతో కల్పించడం విశేషం.
తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు యాత్రికులను తీసుకెళ్లనున్న ఈ ప్రత్యేక రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్‌లో పర్యాటించనుంది. ఫిబ్రవరి 10న అర్ధరాత్రి సికింద్రాబాద్ నుంచి భారత్ దర్శన్ ప్రత్యేక రైలు ప్రారంభం కానున్న ఈ రైలు తిరుచునాపల్లి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారీ, త్రివేండ్రం, మహాబలిపురం, కాంచీపురం ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు దర్శనీయ, పర్యాటక స్థలాల మీదుగా ప్రయాణించి తిరిగి 18వ తేదీని సికింద్రాబాద్ కు చేరుకోనుంది.
ఐఆర్‌సీటీసీ 'తిరుచునాపల్లి-రామేశ్వరం- కన్యాకుమారీ- మహాబలిపురం-కాంచీపురం యాత్రలకు పర్యాటకులను తీసుకెళ్లే భారత దర్శన్ టూరిస్ట్ రైలు విజయవాడ నుంచి ఈ ఫిబ్రవరి నెల 10 అనగా అర్థరాత్రి బయల్దేరుతుంది. అదే రోజు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల వద్ద కూడా యాత్రికులను ఎక్కించుకోనుంది. తిరిగు ప్రయాణంలోనూ ఇవే స్టేషన్ల వద్ద యాత్రికులు వారు ఎక్కిన రైల్వే స్టేషన్లలో దిగే ఏర్పాటును చేసింది ఐఆర్సీటీసీ. కాగా ఈ యాత్రలో రెండు క్యాటగిరీల్లో యాత్రికుల ప్రయాణం సాగనుంది. థర్డ్ ఏసీ త్రి టైర్ తో పాటు స్లీపర్ తరగతిలోనూ యాత్రికులు ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.
**10వ తేదీ రాత్రికి సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రైలు వరంగల్, నెల్లూరు, రేణిగుంట మీదుగా పర్యాటకులను ఎక్కించుకుంటూ 12న తిరుచిరాపల్లికి చేరుకుంటుంది.
** 12న శ్రీరంగం, బృహదీశ్వర దేవాలయం సందర్శనతో యాత్ర ప్రారంభమవుతుంది. 12వ తేదీ తిరుచిరాపల్లి నుంచి బయలుదేరి 13న రామేశ్వరం చేరుకుంటుంది.
**13న రామేశ్వరంలో సముద్రస్నానం, రామనాథస్వామి దర్శనం తరువాత మధురైకి బయలుదేరి అక్కడ మీనాక్షి అమ్మవారిని, తర్వాత సుందరేశ్వర్ దేవాలయం దర్శనం
** 14వ తేదీ నాగర్‌కోయిల్ ఆలయదర్శనం.. కుమారి అమ్మన్ టెంపుల్, గాంధీ మెమోరియల్, వివేకానందరాక్ మెమోరియల్, తరువల్లూవర్ విగ్రహం, సూర్యాస్తమయం వీక్షణం.. కన్యాకుమారి సందర్శనం.
** ఫిబ్రవరి 15న మధ్యాహ్నానికి కోచువేలికి చేరుకుని అక్కడ.. కోవళం, బీచ్ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శన అనంతరం కోచువేలి నుంచి బయలుదేరుతారు.
* ఫిబ్రవరి 16న చెంగల్పట్టు మహాబలిపురం దర్శనం చేసుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.
* ఫిబ్రవరి 17న చెంగల్పట్టులో నుంచి కాంచీపురం ఆలయ దర్శనం తిరిగి చెంగల్పట్టుకు ప్రయాణం. అదే రోజు రేణిగుంటకు చేరుకుని.. 18న రాత్రికి సికింద్రాబాద్ కు వచ్చేస్తారు.
ఉదయం కాఫీ, టీలతో పాటు అల్పాహారం, మధ్యాహ్న బోజనం, రాత్రికి భోజన వసతి, రాత్రిళ్లు బస ఏర్పాట్లు, ఫుణ్యక్షేత్రాల దర్శనానికి రవాణ సౌకర్యంతో సహా అన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. కాగా రెండు తరగతుల్లో జరిగే ప్రయాణంలో స్లీపర్ క్లాసులో ప్రయాణించే యాత్రికులు ఒక్కరికి రూ.7560, ఏసీ థర్డ్ క్లాస్ లో ప్రయాణించే యాత్రికులు ఒక్కరికి రూ.9240 చెల్లిస్తే సరిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more