Yet another set back to YS Jagan govt ఆంగ్ల మాద్యమంపై వైసీపీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు..

English medium in schools yet another set back to ys jagan govt

High Court, YSRCP Government, English medium move, Vijayawada, YS Jagan, AP CM, BJP leaders, Supreme Court Directions, Srinivasa Sudhish Rambotla, Guntupalli Srinivas, Andhra Pradesh govt, Andhra Pradesh, Politics

The high court directed the state and Union government to file affidavits in the PIL challenging the introduction of English medium in all government schools from primary level.

ఆంగ్ల మాద్యమంపై వైసీపీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు..

Posted: 01/28/2020 10:25 AM IST
English medium in schools yet another set back to ys jagan govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు శాసనమండలిలో చుక్కెదురవ్వగా.. ఇక ఆంగ్ల మాధ్యమ బోధన విషయంలోనూ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంగా మార్చడంపై దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అంగ్ల మాద్యమ బోదన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన పలు మార్గదర్శకాలకు విరుద్దంగా వున్నాయంటూ దాఖలైన పిటీషన్లను విచారించిన న్యాయస్థానం.. ఈ విషయంలో ముందుకు వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది.

తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్లం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై ముందుకెళ్తే.. ఆ ఖర్చును అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పింది ధర్మాసనం. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది హైకోర్టు.

కాగా నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఆంగ్ల మాధ్యమంపై స్టే ఇస్తామని తేల్చి చెప్పింది. విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది ఏపీ సర్కారు. దీనికోసం  నవంబరు 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 85ను జారీ చేసింది. అయితే దీనిని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, బీజేపి నాయకుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  YSRCP Government  English medium move  Vijayawada  YS Jagan  AP CM  Andhra Pradesh  Politics  

Other Articles