Minister shocking desicion turns activist a Chair Person కార్యకర్తకు అందలం.. మంత్రి జగదీశ్ రెడ్డి అనూహ్య నిర్ణయం

Minister jagadish reddy shocking desicion turns activist a chair person

municipal elections, suryapet, jagadish reddy, telangana minister, chair person, SC women, Annapurna, Suryapet district, Telangana, Politics

Hats off to Telangana Minister Jagadish Reddy in making a ordinary activist a councillor and elected her as chair person of Suryapet Muncipality, who in turn was shocked and become emotional and made even Minister emotional.

కార్యకర్తకు అందలం.. మంత్రి జగదీశ్ రెడ్డి అనూహ్య నిర్ణయం

Posted: 01/28/2020 01:39 PM IST
Minister jagadish reddy shocking desicion turns activist a chair person

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి తన మార్కు రాజకీయం ప్రదర్శించి.. అందరిచేత ఔరా అనిపించాడు. పార్టీ కోసం నిజంగా కష్టించేవారికి పదవులు కూడా అంతే తేలిగ్గా నడుచుకుంటూ వస్తాయని నిరూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పోటీలో వున్నా.. నిజమైన కార్యకర్తలు వుంటే వారు పేదలైనా.. పదవులను అలకరించేలా చేయడం పెద్ద సమస్య కాదని మరోమారు రుజువుచూశాడు. వడ్డించేవాడు మనవాడైతే.. అన్నట్లు నాయకులు తమ నిజమైన క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నాల్లో పేదలను కూడా గుర్తించినప్పుడే.. క్యాడర్ మరింత బలోపేతం అవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి నిరూపించారు.

సూర్యాపేట.. తాజాగా రియల్ ఎస్టేట్ బూమ్ తో మంచి రేజింగ్ లో వున్న వున్న ప్రాంతం. తన అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక పురపాలక సంఘం కావడంతో ఈ ఫీఠాన్ని దక్కించుకునేందుకు మంత్రి మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ పురపాలక సంఘానికి మరోమారు ఎన్నికలు జరిగుతున్న నేపథ్యంలో మంత్రి అద్యంతం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక.. చైర్ పర్సెన్, వైస్ చైర్ పర్సెన్ వరకు అన్నింటీలోనూ తన మార్కు రాజకీయ చతురతను ప్రదర్శించి.. నిజమైన కార్యకర్తలకు విజయాన్ని కట్టబెట్టారు.

గెలుపు గుర్రాల ఎంపికలో అనూహ్యంగా చాలామంది సిట్టింగ్లకు రిక్తహస్తాలను చూపారు. వారి నుంచి ప్రతిసవాల్ ఎదుర్కోన్నా.. తన వారిని గెలిపించుకున్నారు. మున్సిపాలిటీలోని 9వ వార్డు జనరల్ స్థానానికి కేటాయించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు పోటీపడి మరీ ఎన్నికల బరిలో నిలిచే స్థానం. ఆ స్థానం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఒక దళిత మహిళను జనరల్ స్థానం నుంచి బరిలో దింపారు. మంత్రి ప్రచారంతో అమె విజయకేతనం ఎగురవేసింది. అంతేకాదు.. అమెను మరో పదవి కూడా వరించింది. మంత్రివర్యులు అమెను సూర్యాపేట మున్సిఫల్ చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. దీంతో ఎందరో అశావహులకు ఈ నిర్ణయం నిర్ఘంతపోయేలా చేసింది.

ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ ఆశవహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్ పర్సన్ అభ్యర్థిని అన్నపూర్ణ ను ప్రకటించారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఎన్నిక విషయం తెలియక పోవడంతో కౌన్సెలర్ అయితే చాలు అనుకున్న అన్నపూర్ణ ఆనందంతో కన్నీరు కారుస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. అన్నపూర్ణ మొదటి నుండి జగదీశ్ రెడ్డి వెంట ఉంటూ ఆయన బాటలోనే నడిచారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అనూహ్య నిర్ణయంతో అనూహ్యంగా చైర్‌పర్సన్‌ పదవి వరించడంతో అమె తీవ్ర భావోద్వేగానికి గురై మంత్రికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles