కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటార్ వాహన చట్టంపై దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కారీ.. కొత్త రవాణాచట్టం అమలు రాష్ట్రాల ఇష్టానికే వదిలేస్తూ.. వాటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలేనంటూ బంతిని రాష్ట్రాల కోర్టులో వదిలేసారు. దీంతో రాష్ట్రాలు ప్రజలపై పెనుభారాన్ని చూపే జరిమానాల జోలికి వెళ్లడం లేదని చెప్పడంతోపాటు ఈ చట్టంలో పలు సడలింపులను చేకూర్చుతూ నిర్ణయం తీసుకున్నాయి.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తీసుకువచ్చినా.. భారీ జరిమానాలతో ప్రజలు బెంబేలెత్తిపోవడంతో.. వెనక్కు తగ్గింది. అయితే ఇలా అయినా వాహనదారులు క్రమపద్దతితో వాహనాలను నడిపిస్తారని కేంద్రం ఆశించింది. మరీ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగా అనేక మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే హెల్మెట్ రూల్ మస్ట్ చేసింది ప్రభుత్వం. అయినా కొంతమంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించకుండానే వాహనం నడుపుతున్నారు.
ఈ క్రమంలో హెల్మెట్ ధరించడం ఎంత అవసరమో తెలిపింది ఓ శునకం. హెల్మెట్ ధరించిన కుక్క వీడియో వైరల్ గా మారింది. తమిళనాడులోని ఓ ఇద్దరు స్నేహితులు తమ వాహనంపై వెళ్తూ తమ పక్కనే ఓ బైక్ పై వెళ్తున్న ఇద్దరిని చూశారు. చూసి చూడంగానే బైక్ నడుపుతున్న వ్యక్తి సాధారణంగానే వున్నారు. అయితే వెనుక కూర్చున్నదెవరా అని పరిశీలనగా చూశారు. ఎందుకంటే అచ్చంగా మనిషిలానే వున్న ఎక్కడో కొంత తేడా మాత్రం కనిపిస్తోంది. దీంతో దగ్గరగా వెళ్లారు. చూశారు.. వెంటనే పగలబడి నవ్వుకున్నారు.
అంతే తమ పక్కన మరో వాహనంపై వస్తున్న మిత్రులకు చెప్పారు. ఒరేయ్ కుక్క కూడా హెల్మెట్ పెట్టుకుందిరా.! అని.. అర్థకాక మిత్రుడు ఏంటీ అని అడిగాడు.. బైక్ మీద వెళ్తున్న కుక్క కూడా హెల్మెట్ పెట్టుకుందిరా.. చూడు అంటూ అరిచాడు.. వారు వచ్చి పరిశీలనగా చూసి.. ఔనురా అంటూ నవ్వుకుని.. వెంటనే జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని బంధించారు. అంతటితో ఆగకుండా వెంటనే దానిని సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది.. గంటల వ్యవధిలోనే ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది.
వాహనదారులకు గొప్ప సందేశం ఇచ్చిందని పలువురు నెటిజన్లు ప్రశంసించాగా.. కొందరు మాత్రం తప్పుబట్టారు. ఈ కుక్కను చూసి నేర్చుకోండని కామెంట్స్ చేశారు. హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలుసుకోండి అని చెప్పారు. తన భద్రత కోసం శునకం హెల్మెట్ పెట్టుకుందని.. ఇది మంచి పని అని కితాబిచ్చారు. ఇక కుక్క కేర్ కోసం దాని యజమాని తీసుకున్న శ్రద్ద ప్రశంసనీయం అన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కుక్కకి కూడా అర్థమైంది.. కానీ మనుషులకే అర్థం కావడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కొందరు ఇది కరెక్ట్ కాదంటూ.. కుక్క యజమానిపై మండిపడ్డారు. ఏ మాత్రం పట్టుతప్పినా.. బైక్ నుంచి కుక్క కింద పడిపడి.. గాయపడుతుందని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more