RTC employees get Sankranti Festival Gift ఆర్టీసీ కార్మికులకు అడ్వాన్స్ సంక్రాంతి ‘గిప్ట్’..!

Rtc employees get sankranti festival gift in advance

bus rates, bus fares, bus passes, Strike, Sankranti Festival Gift, RTC employees, Muncipal Elections, Election commission, Telangana, Politics

Telangana Government which was very harsh at the time of Stirke, now announces a Sankranti Festival Gift to RTC employees in Advance.

ఆర్టీసీ కార్మికులకు అడ్వాన్స్ సంక్రాంతి ‘గిప్ట్’..! ప్రకటించిన ప్రభుత్వం

Posted: 01/08/2020 04:18 PM IST
Rtc employees get sankranti festival gift in advance

ఆర్టీసీ ఉద్యోగులకు పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే మున్సిఫల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో ఈ నెల 22న ఎన్నికలు జరుగనున్న తరుణంలో క్రెడిట్ తమ ఖాతాలోకి వేసుకునేందుకు ఇష్టపడని రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం క్రెడిట్ ను అర్టీసీ యాజమాన్యానికి వర్తించేలా వారి ఖాతాలోకి వేసింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ దాదాపు 55 రోజులపాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

కాగా... ఆ సమ్మె చేసిన రోజుల్లో కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. అసలు వారి డిమాండ్లను కానీ, సమస్యలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి తమ ఉద్యోగాలు పోయాయని మానసిక అందోళనకు గురైన పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా.. మనోవేధనతో గుండె బద్దలై మరణించినా పట్టించుకోలేదు. కార్మికులు మెట్టుదిగి తమకు ఏ డిమాండ్లు లేవని, ఉధ్యోగాలను ఇస్తే చాలునని బతిమాలినా.. జేఏసీ సమ్మెను విరమించినా.. పట్టించుకోని ప్రభుత్వం.. విధుల్లోకి చేరేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఇదే సమయంలో కార్మిక సంఘాలను విశ్వసిస్తే ఫలితం ఆగమ్యగోచరంగా వుంటుందన్న విషయం కార్మికులకు బోధపడిన తరువాత.. కార్మికులను విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ.. నిర్ణయం తీసుకుంది. అయితే న్యాయస్థానం చోరవతో అప్పటికే తాము చేసిన పనిదినాల వేతనాన్ని దక్కించుకున్న కార్మికులకు సమ్మె రోజుల జీతంపై మాత్రం ఎలాంటి స్పష్టతను ఇవ్వకుండానే వారిని విధుల్లో చేర్చుకుంది. కాగా, సంక్రాంతి పండగ సందర్భంగా వారికి శుభవార్తను అందించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో  202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు.

ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయనున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను యాజమాన్యం చెల్లించింది. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు  ఆర్టీసీ యాజమాన్యం రిలీజ్ చేసింది.

కాగా పురపాలక సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో రాష్ట్రంలోని అధికశాతం కార్మికులు పురపాలక సంఘాల పరిధిలోనే వుంటున్నారని గ్రహించి.. పరోక్షంగా ఈ క్రెడిట్ ను అధికార పార్టీ తమ ఖాతాలో వేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వినబడుతున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు మేలు చేస్తూ మంచితనాన్ని, మానవత్వాన్ని చాటుకోవడంతో అటు ప్రజల్లో అధికభాగం వుండే తటస్థ ఓటర్ల మనస్సులను కూడా గెలుచుకుని.. పార్టీ పరంగా ఎన్నికలలో లబ్దిని అధికార పార్టీ ఆశిస్తుందని కూడా రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles