Another farmer dies of cardiac arrest in Amaravati మరో గుండె అగింది.. రాజధాని ప్రాంత రైతు మృతి..

Another farmer dies of cardiac arrest in amaravati

YS Jagan, Amaravati, krupanandam, krishanyapalem, addepalli krupanandam, Amaravati farmer, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Even after intensifying their agitation on capital city area Amaravati the government is moving further on its three capital decision, this made another farmer krupanandam die out of heart attack.

మరో గుండె అగింది.. రాజధాని ప్రాంత రైతు మృతి..

Posted: 01/08/2020 01:25 PM IST
Another farmer dies of cardiac arrest in amaravati

అమరావతిలోనే రాజధానిని కోనసాగించాలని.. రాష్ట్రానికి ఏకైక రాజధాని మాత్రమే ముద్దని డిమాండ్ చేస్తూ గత నెల 17 నుంచి ఉద్యమబాట పట్టి.. అమరావతి ప్రాంత రైతులు గడిచిన మూడునాలుగు రోజులుగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం తమను అసలు పట్టించుకోకుండా పెయిడ్ అర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసి.. కించపరుస్తున్న క్రమంలో మానసిక అందోళనకు గురైన మరో రైతు గుండె అగింది. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు  అద్దేపల్లి కృపానందం (68) బుధవారం  తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు.

ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన  తనకున్న  0.50 సెంట్ల  భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున  గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

రాజధాని రైతు మరణించాడనే వార్త తెలియడంతో  గ్రామ ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా రైతు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృపానందం కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేసిన నారా లోకేష్.. రాజధాని కోసం ఆందోళనలతో రైతు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి మూర్ఖపు నిర్ణయాలకు వెళ్లకుండా రాజధాని ప్రాంత రైతుల గొంతును కూడా వినాలని నారాలోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles