Bus vandalised in cooch behar of west bengal కొనసాగుతున్న భారత్ బంద్.. బస్సుపై రాళ్లు రువ్విన అగంతకులు

Bharat bandh bus vandalised in cooch behar of west bengal

Bharat Bandh, Bharat Bandh 2020, Bharat Bandh against Modi govt, bharat bandh bangalore, trade unions, Trade unions oppose labour law, trade unions strike, Air India sale, bank mergers in india, bank merger latest, bank workers strike, january 8, student unions strike, anti people economic ways, national politics

During All-India general strike or 'Bharat Bandh', A bus vandalised in Cooch Behar during the Bharat Bandh called by ten trade Unions against 'anti-worker policies of Central Govt'

కొనసాగుతున్న భారత్ బంద్.. బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

Posted: 01/08/2020 12:31 PM IST
Bharat bandh bus vandalised in cooch behar of west bengal

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను సవరించి నాలుగు కోడ్ లుగా విభజించే బిల్లును వ్యతిరేకిస్తూ.. దానిని వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ తో జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తూ.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని.. పారిశ్రామిక వేత్తలకు మాత్రం లబ్దిచేకూర్చుతుందని కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టాయి.

దేశంలోని పబ్లిక్ సెక్టార్ సంస్థలను సైతం ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ లో బ్యాంకింగ్ రంగ కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు మృగ్యమయ్యాయి. కార్మికుల వేతనా సవరణ, మినిమమ్ వేతనాల పెంపు, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవేటీకరణ, సీఏఏ చట్టం ఉపసంహరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ పది జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీరికి విద్యార్థి, రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన తరుణంలో బంద్ పలు రాష్ట్రాల్లో ప్రభావాన్ని చూపుతుంది. ప్రధానంగా ఉత్తరాది జిల్లాల్లో అధిక ప్రభావం కనబడుతొంది.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. కూచ్ బెహర్ లో ఆందోళనకారులు ఓ బస్ ను ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలోకి బస్సు రాగానే దానిపై రాళ్లు రువ్వి, దాని అద్దాలను పగులకొట్టారు. దీంతో అందులోని ప్రయాణికులు వణికిపోయారు. అనంతరం బస్సు దిగి వెళ్లారు. బస్సుపై దాడి చేసిన యువకులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. బీఎంఎస్‌ మినహా అన్ని కార్మిక, రైతు, ఆటో సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles