police restrictions on mandadam villages సీఎం రాకతో.. మందడం గ్రామస్థులపై పోలీసుల ఆంక్షలు

Cm visit to amaravati police restrictions on mandadam villages

YS Jagan, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Intensifying the agitation, farmers of the capital city area Amaravati has showed placards to CM YS Jagan on 6th of this week, which had a impact on police and made them to take more stingt action on Mandadam villagers inspite of CM Jagan visit to Amaravati today.

సీఎం రాకతో.. మందడం గ్రామస్థులపై పోలీసుల ఆంక్షలు

Posted: 01/08/2020 11:45 AM IST
Cm visit to amaravati police restrictions on mandadam villages

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతి పరిధిలో ఎక్కడ చూసిన రైతులు అందోళనబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాల అమరావతిలోని సచివాలయానికి వస్తున్న తరుణంలో అమరావతి పరిధిలో పోలీసులు అంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా అమరావతి సచివాలయానికి చేరుకునే ప్రధాన మార్గంలో వున్న మందడం గ్రామంలో పోలీసులు అంక్షలు మరింత తీవ్రంగా వున్నాయి. దీంతో పోలీసులు సీఎం రాక నేపథ్యంలో గ్రామంలో అప్రకటిత కర్ప్యూ వాతావరణాన్ని సృష్టించారు.

మందడంలోని అన్ని వ్యాపార సంస్థలను, దుకాణాలను మూసివేయించిన పోలీసులు గ్రామస్థులు రోడ్డపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే నామమాత్రంగా మెడికల్ షాపులను మినహా అన్ని దుకాణాలను బంద్ చేయిస్తున్నారు. ఈ నెలలో సచివాలయంకు వెళ్తున్న జగన్ కాన్వాయ్ రాగానే జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకారులు నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో మందడం గ్రామంలో మహిళలు ఆందోళనలు నిర్వహించారు.

కొందరు ఇళ్ల వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు నిర్వహించారు. దీంతో  ఉన్నాతాధికారులు స్థానిక పోలీసు అధికారులకు క్లాస్ తీసుకున్నారని, దీంతో ఇవాళ మరోమారు సీఎం వైఎస్ జగన్ అమరావతిలోని సచివాలయానికి వెళ్తున్న నేపథ్యంలో మందడంలో మరోమారు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా గ్రామస్థులపై అంక్షలు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది. జగన్ సచివాలయానికి వెళ్లిన తరువాతే భోజనాలు చేయాలని పోలీసులు చెబుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ రాక నేపథ్యంలో మందడం గ్రామంలోని హోటళ్లు, టీ స్టాళ్లులను కూడా పోలీసులు తెరవనీయడం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. కాగా, ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  farmers  Mandadam  police restrictions  YS Jagan  Capitals  Andhra Pradesh  Politics  

Other Articles