Yanamala slams AP govt on Three Capitals issue ‘‘ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ముద్దు’’: సీఎంపై యనమల విమర్శలు

Yanamala ramakrishnudu comments on andhra pradesh three capitals

Chief Minister, YS Jagan, Capitals, Yanamala Ramakrishnudu, Amaravati Farmers, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

Senior TDP Leader Yanamala Ramakrishnudu slams Andhra Pradesh YSRCP government on Three capitals issues, says he agrees with AP Govt proposal to give Kurnool city a Judicial capital, but opposes Executive capital at Visakhapatnam as it incurrs heavy budget.

‘‘ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ముద్దు’’: సీఎంపై యనమల విమర్శలు

Posted: 12/18/2019 12:54 PM IST
Yanamala ramakrishnudu comments on andhra pradesh three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో మూడు రాజధానులు వుండే అవకాశాలు వుంటాయని సంకేతాలను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు అందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి సింగిల్ రాజధానిగా వుండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ముద్దు.. మూడు వద్దు అంటూ వారు ప్లకార్డులు పట్టుకుని అందోళనకు దిగారు. వెలగపూడి, వెంకటపాలెంలోని రైతులు ఏకంగా నిరాహార దీక్షలకు దిగారు.

అటు అమరావతికి చేరుకునే మార్గంలోని మందడంలో ఆ ప్రాంత రైతులు రోడ్డుపైనే బైఠాయించారు. సచివాలయం వైపు వెళ్లే రహదారి కావడంతో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా తాము తమ పోలాలను ఇచ్చామని.. తాజాగా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకువస్తోందని.. ఇది తమకు సమ్మతం కాదని అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం రాజధానికి భూములు ఇచ్చామని, తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేనని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు.

ఈ క్రమంలో మూడు రాజధానుల ప్రతిపాదన అనాలోచిత నిర్ణయమన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని చెప్తూనే.. ఇప్పుడు విశాఖలో రాజధాని అంటే ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. అదే అమరావతి అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు ఇవ్వడం సంతోషమని ఐతే.. పాలనా వ్యవహారాల విషయంలో రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఆంధ్రుల రాజధాని షెటిల్ సర్వీస్‌లా మారితే ఎలాగన్నారు.

వృధ్దా ఖర్చులను తగ్గిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మూడు రాజధానులు ప్రతిపాదనతో ప్రజలపై పెద్దఎత్తున్న భారం వేస్తోందని విమర్శించారు. జగన్ హైదరాబాద్‌లో తన ఆస్తులు కాపాడుకునేందుకే.. రాజధాని అమరావతిని ముక్కలు చేశారని యనమల అన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తాము చెప్తున్న విషయాల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు యనమల. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతి రాజధానిగా అన్నివర్గాలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. జగన్ నిర్ణయం ప్రభావం పాలనపై తీవ్రంగా ఉంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles