MoS Railways Suresh Angadi stokes controversy అగ్గికి ఆజ్యం పోసిన కేంద్రమంత్రి కామెంట్స్..

Shoot at sight anyone destroying rail property suresh angadi

Suresh Angadi, Union Minister of State for Railways, Anti-CAB Violence, Citizenship amendment bill, guwahati, police firing, amit shah, Citizenship amendment bill, Citizenship (Amendment) Bill 2019, BJP, Union Minister for Home Affairs, Amit Shah, Citizenship ammendment bill, CAB, Congress, Parliament, Nation, Politics

As nationwide protests continue over the Citizenship (Amendment) Act, Union Minister of State for Railways Suresh Angadi said he has directed railway officials to “shoot at sight” anybody who causes damage to Railway property.

కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగాడీ వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 12/18/2019 01:46 PM IST
Shoot at sight anyone destroying rail property suresh angadi

దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైందని పేర్కొంటూ.. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక వాతావరణం అలుముకున్న తరుణంలో కేంద్ర మంత్రి కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతు్న అందోళనకారులపై రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగాడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న అందోళనకారులకు ఆయన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా వున్నాయి.

నిరసనల్లో భాగంగా ఆందోళనకారులెవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వారిని అక్కడికక్కడే కాల్చి పడేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా పశ్చిమబెంగాల్ లో కొందరు ఆందోళనకారులు ముర్షీదాబాద్ రైల్వేస్టేషన్ కు నిప్పుపెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తిని ధ్వంసం చేసే ఎవరినైనా కాల్చి పడేయాలని కేంద్ర మంత్రిగా తాను అధికారులకు చెప్పినట్టు అంగాడీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే శాఖ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు.

రైల్వేల అభివృద్ధికి 13 లక్షల మంది రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రతిపక్షాల మద్దతుతో సమస్యలు సృష్టిస్తున్నాయని అన్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఎలాంటిదైనా.. అందోళనకారులను మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా కొనసాగుతున్న మంత్రికి పౌరసత్వం సవరణ బిల్లు నోప్పులు ఎలా అర్థమవుతాయని, తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. తాము కూడా భారత్ దేశంలో భాగమేనని, తమ డబ్బులు కూడా కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేస్తోందని.. కానీ తమ నిరసనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా బిల్లను అమోదించడం ఎలా సమ్మతిస్తామని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles