టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఇకపై తన కారును డ్రైవింగ్ చేస్తే.. ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు వున్నాయని అంటున్నారు పోలీసులు. ఆయన తన కారును డ్రైవింగ్ చేస్తున్నట్లు నగరంలోని ఏ సీసీ కెమెరాల్లో రికార్డైయినా.. ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఆయన డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనపై ఈ చర్యలకు పోలీసులు ఉపక్రమించేందుకు సన్నధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్టీఏ అధికారులు మీడియాకు వెల్లడించారు.
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో రాజశేఖర్.. గత దశాబ్దమున్నర కాలంగా సినిమాలతో కాకుండా ఇతరాత్ర వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తన తల్లి మరణాన్ని దిగమింగుకోలేక ఆయన కొంత మానసిన అవేదనకు గురై ఇలా వ్యవహరించారని ఆయన సతీమణి, నటి జీవిత మీడియాకు తెలిపారు. ఆ తరువాత గత నెల 13న ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని టోలీచౌకీ ఆర్టీఏ అధికారులకు శంషాబాద్ పోలీసులు లేఖ రాశారు.
దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక ఆయనకు కారు నడిపించే అవకాశాలు దూరమయ్యాయి. అయితే ఆయన ఒకవేళ కారు నడిపిస్తే.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలని రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. ఆయన డ్రైవింగ్ లైసెన్సును సప్పెండ్ చేయాలని కోరడంతో మరో విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు.
నిజానికి రాజశేఖర్ డ్రైవింగ్ లెసెన్స్ అసలు మనుగడలోనే లేదని తేలింది. దీంతో షాకైన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న నటుడిపై మరో కేసు నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు. రాజశేఖర్ వాహనంపై ఏడాదిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు తేలింది. వీటిలో 19 పరిమితికి మించిన వేగానికి సంబంధించినవే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన లైసెన్స్ సస్పెన్షన్‌లో ఉండడంతో ఇప్పటికిప్పుడు పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని, మే 28 తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని సమాచారం. లైసెన్స్ లేకుండా అప్పటి వరకు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more