Former CMs booked for sedition over protest మాజీ సీఎంలు, పోలీసు అధికారులపై కేసులు..

Former cms booked for sedition over protest against it raids

FIR against Siddaramaiah, FIR againts HD Kumaraswamy, former chief ministers, HD Kumaraswamy, Siddaramaiah, HD Kumaraswamy, BJP, congress, jds, IT raids, bypolls in Karnataka, bs yediyurappa, Husnur, Mysuru, Karnanataka bypolls, DV Sadananda Gowda, shedding tears, Karnataka, politics

Just a week ahead of the crucial bypolls to 15 Assembly segments in the state, several top Congress and JDS leaders and also some senior police officers have been charged with sedition, criminal conspiracy and attempting/abetting waging war against the Government of India, among others.

ఉపఎన్నికల వేళ.. మాజీ సీఎంలు, పోలీసు అధికారులపై కేసులు..

Posted: 11/29/2019 06:42 PM IST
Former cms booked for sedition over protest against it raids

మహారాష్ట్రలో అనూహ్య రాజకీయా పరిణామాలను చవిచూసిన దేశప్రజలు.. తాజాగా కర్ణాటకలో ఆ మార్పులు గమనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరద్ పవార్ ను బ్యాంకు నిధుల వ్యవహారంలో విచారిస్తారని వార్తలు రావడంతో ఆయనే స్వయంగా అధికారుల వద్దకెళ్లిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో సరిగ్గా ఉపఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలపై బెంగళూరు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో వీరిని కూడా సరిగ్గా ఎన్నికల ముందు అదుపులోకి తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సాక్ష్యాత్తు జాతిపిత మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిన వ్యక్తిని దేశభక్తుడని పార్లమెంటులో పేర్కోన్న వ్యక్తులపై ఎలాంటి చర్యలను తీసుకోని అధికారులు, సామాజిక కార్యకర్తలు.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగాంగా తమ పార్టీ నేతలను టారెట్ చేస్తూ వారిపై కేసులు బనాయిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసనను వ్యక్తం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారుల చర్యలపై నిలదీస్తే.. రాజద్రోహం కింద కేసులు బనాయించాలని అంటారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఈ ఏడాది మార్చి 27న అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, అప్పటి ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు తదితరులు క్వీన్‌ రోడ్డులోని ఐటీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేశారు. ఐటీ అధికారులు భాజపా ఏజెంట్లు అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై మల్లికార్జున అనే వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

ఐటీ దాడులపై అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పార్టీ నేతలకు ముందే సమాచారం లీక్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే ఐటీ అధికారులు సోదాలకు వెళితే కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. మాజీ ముఖ్యమంత్రులు సహా సంకీర్ణ నేతలపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా.. దీనిపై కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని, దీనిపై తాము పోరాడుతామని అన్నారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HD Kumaraswamy  Siddaramaiah  bjp  congress  jds  IT raids  Karnanataka bypolls  Karnataka  politics  

Other Articles