Minister Talasani Reacts On Priyanka Reddy case? ప్రియాంక కేసులో నిందితులంతా 25 ఏళ్ల లోపువారే..

All accused in priyanka murder case are below 25 years old

veterinary doctor murdered and burnt, burnt body of woman vet, Priyanka reddy murdered, Priyanka reddy burnt, priyanka reddy accused, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, rachakonda police, Telangana, Crime

The Cyberabad police had taken all the accused into the custody in the woman veterinary doctor Priyanka murder case. Its come to know that all the accused are below 25 years and traped the victim, near Chatanpally village of Shadnagar.

ITEMVIDEOS: ప్రియాంక కేసులో నిందితులంతా 25 ఏళ్ల లోపువారే..

Posted: 11/29/2019 03:53 PM IST
All accused in priyanka murder case are below 25 years old

సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల తక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే తమ బిడ్డ దుర్మార్గుల చేత చిక్కి నరకయాతన అనుభవించి అనంతలోకాలకు తరలివెళ్లిందని ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి పోలీసులపై సంచలన అరోపణలు చేశారు. తమ కూతురు ఆపదలో వుందని, అదృశ్యమైయ్యిందని పోలిస్ స్టేషన్ కు వస్తే.. పోలీసులు అవమానక రీతిలో బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి వుంటుందని వ్యాఖ్యలతో కాలయాపన చేశారని ఆయన అరోపించారు.

తన కూతురు ఫోన్ రాత్రి 10 గంటలకు స్విచ్ఛాప్ కావడంతో అందోళన చెందిన తాము రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ పోలీసులకు పిర్యాదు చేశామని తెలిపారు. అయితే పోలీసులు అమ్మాయిని వెతకడం ప్రారంభించేందుకు బదులు సీసీ కెమెరాల ఫూటేజిని చూస్తు కూర్చోవడం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. తాను పిర్యాదు చేయగానే పోలీసులు గాలింపు చేపట్టి వుంటే తమ కూతురు సజీవంగా వుండేదని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో శంషాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని అయన అరోపించారు.

ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి వెళ్తే వేరే పోలిస్ స్టేషన్ కు వెళ్లాలని పోలీసులే ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆయన వాపోయారు. మనిషి మరణించిన తరువాత ఎన్ని బృందాలతో వెతికితే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజా రక్షణ కోసం వున్న పోలీసుల వద్దకు వస్తే.. తామేదో నేరం చేశామన్న భావన కలిగేలా ప్రవర్తిస్తున్నారని అరోపించారు. తమకు ఆపద వచ్చినప్పుడు కాకుండా.. పోలీసులకు తీరిక వున్నప్పుడు తాము పిర్యాదులు చేయడానికి వెళ్లలా.? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ దాటవేత ధోరణిలో సమాధానాలు మీరే చూడండీ..

ప్రియాంకారెడ్డి హత్యకేసు తెలుగురాష్ట్రాలలో సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసు చేధనను సవాల్ గా తీసుకున్నారు. దీంతో 24 గంటలు కూడా తిరగకముందే ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దారుణమైన ఘాతుకానికి పాల్పడిన నిందితులందరూ పాతికేళ్ల లోపు యువకులేనని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. వీరిని రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

ప్రియాంక హత్యకేసులో ఐదుగురు వ్యక్తులకు ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నా వారిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు నిందితుడు మాత్రం ఇప్పటికీ పరారీలో వున్నాడని తెలుస్తోంది. వీరంతా ప్రియాంకా సాయంత్రం తన బైక్ ను పార్క్ చేసినప్పుడే అమెను గమనించి.. పథకాన్ని రచించారని.. తెలుస్తోంది. అయితే వారి పథకంలో భాగంగానే కారు పంక్చర్ చేసి.. జనసాంధ్రత వున్న ప్రదేశం నుంచి అమెను నిర్జన ప్రదేశానికి వచ్చేలా చేసేందుకు పంక్చర్ వేయిస్తామని నాటకాన్ని అడారని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషాను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు. అదే మండలంలోని గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు  పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి రాయచూర్ కు డీసీఎంలో నిందితులు స్టీల్ రాడ్లను తరలించే పనిలో ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తోన్న వీరే ప్రియాంకారెడ్డిని హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles