Godman Nithyananda missing; Gujarat police clueless పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు నిత్యానంద పరార్..

Nithyananda swami missing gujarat police mha mea clueless

Nithyananda missing, Swami Nithyananda, Nithyananda escaped, Where is Nithyananda, Swami Nityananda, Swami Nityananda institute, godman Nityananda, Nithyananda Dhyanpeetham, Yogini Sarvagyapeetham, Gujarat High Court, Janardana Sharma, Daughters, Swami Nithyananda, Lopamudra, Habeas Corpus, bangalore, ASHRAM, Karnataka, Ahmedabad, crime

The self-styled controversial 'godman' Nithyananda has fled India, after the gujarat police files FIR on missing of two girls from his School. Gujarat Police has requested a detailed report from the Foreign Ministry on Nithyananda.

పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు నిత్యానంద పరార్..

Posted: 11/22/2019 02:44 PM IST
Nithyananda swami missing gujarat police mha mea clueless

వివాదాస్పద స్వామిజీగా ఆథ్యాత్మికవేత్తగా చరిత్రకెక్కిన నిత్యానంద తాజాగా మరో చరిత్ర సృష్టించారు. తనపై కేసు నమోదు చేసిన గుజరాత్‌ పోలీసుల కళ్లు గప్పి విదేశాలకు పారిపోయాడు. నాలుగు రోజుల క్రితం తన బిడ్డలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని కోరుతూ ఓ తండ్రి వేసిన కేసు నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు అతనిపై కేసు నమోదు చేయాలని అదేశించింది. దీంతో పాటు చిన్నారులను నిర్భంధించి ఆశ్రమఖర్చుల కోసం వారితో విరాళాలు వసూలు చేస్తున్నారన్న అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో దైవాంశసంభూతుడు పరదేశాలకు పరారయ్యాడు. గుజరాత్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన పోలీసులతో పాటు విదేశాంగ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కళ్లుగప్పి పరారయ్యారు.

ఇక ఆయను గుజారాత్ హైకోర్టులో ప్రవేశపెట్టాల్సిన సమయంలో ఆశ్రమానికి వెళ్లి విచారించిన పోలీసులకు అశ్రమవాసుల నుంచి వచ్చిన సమాధానంతో షాక్ అయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు నిత్యానంద స్వామి అచూకీపై పూర్తి వివరాలు కావాలని కోరుతూ ఓ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిత్యానందకు చెందిన అహ్మదాబాద్ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానందపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు.. చిన్నారులను కిడ్నాప్‌ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. నలుగురు చిన్నారులను ఆశ్రమంలోని ఫ్లాట్‌ నుంచి రక్షించిన పోలీసులు వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిత్యానందపై కేసు నమోదు చేశారు. చిన్నారులను అక్రమంగా నిర్బంధించి వారిచే ఆశ్రమాన్ని నడిపేందుకు విరాళాలను వసూలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్రమంలో సాగుతున్న వ్యవహారం రట్టయింది.

ఇక తనకు ఎలాంటి సమాచారం అందించకుండా తన పిల్లలను కర్ణాటకలోని బెంగళూరు ఆశ్రమం నుంచి గుజరాత్ లోని యోగిని అశ్రమానికి బదిలీ చేశామని నిత్యానంద ఆశ్రమ నిర్వాహకులు చెబుదున్నారని.. ఇక్కడి వస్తే తన బిడ్డలను చూడటానికి కూడా వీలు కల్పించడం లేదని జనార్థన్ శర్మ అనే ఓ త్రండి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డలను కోర్టులో ప్రవేశపెట్టి తనకు అప్పగించాలని కూడా ఆయన కోరుతూ.. న్యాయస్థానంలో హెడియస్ కార్పస్ దాఖలు చేసారు. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles