Pawan kalyan questions CM Jagan, Is power to change colours అధికారం.. రంగుల మార్చడానికా.?: సర్కార్ కు పవన్ ప్రశ్న

Pawan kalyan questions cm jagan is power to change colours

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, government building colour change, Gandhi statue colour change, 350-A, Telugu language, English medium, Telugu medium, Mother Tongue, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena president Pawan Kalyan posted a ruling YSR Congress Party flag coloured Mahatma Gandhi photo on his twitter on Friday. He questioned to Chief Minister YS Jagan Mohan Reddy that Yester day Nataional flag, today Gandhiji, Who is tomorrow?.

అధికారం.. మార్పుకా.? రంగుల మార్చడానికా.?: సర్కార్ కు పవన్ కల్యాణ్ ప్రశ్న

Posted: 11/22/2019 04:24 PM IST
Pawan kalyan questions cm jagan is power to change colours

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతం కావడం.. ఆ తరువాత ప్రభుత్వం కూడా దిగివచ్చి ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు బలవన్మరణాలకు పాల్పడిన భవన నిర్మాణ రంగంలోని కార్మికుల కుటుంబాలకు పరిహారంగా రూ.5లక్షలు అందిస్తామని ప్రకటించడం.. ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్లక్షానికి కారణాలే అయినా.. పరోక్షంగా మాత్రం పవన్ కల్యాన్ జనసేన విజయాలేనని చెప్పకతప్పదు.

వీటి తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జగన్ సర్కార్ ను ఓ వైపు టార్గెట్ చేస్తూనే వున్న జనసేనాని.. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని కూడా ట్వీట్ చేయడం.. తెలుగు బాష కేంద్రం నిధులు తీసుకువచ్చేందుకేనా అని కూడా ప్రశ్నించారు. తాజాగా పవన్ కల్యాణ్ అద్భుత మెజారిటీతో ప్రజలు అధికారాన్ని అందిస్తే దానిని మార్పుకు వినియోగించకుండా.. కేవలం రంగులు మార్చడానికి వినియోగించడమేంటని పవన్ కల్యాణ్ వేసీపీ సర్కార్ ను నిలదీశారు.

విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఘటనపై మండిపడ్డారు. 'వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???' అని పవన్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. కాగా, ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles