Telangana public and optional holidays list for 2020 2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా ఇవే..

Telangana govt releases list of public and optional holidays list for 2020

Telangana, Public Holidays, Holidays In 2020, telangana government holidays 2020, telangana govt holidays 2020, ts holidays 2020, Telangana, Politics

The Telangana government on Friday announced the list of Public and optional holidays for the year 2020. State chief secretary Shailendra Kumar Joshi has released a GO with respect to the holidays' list.

2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా ఇవే..

Posted: 11/22/2019 01:17 PM IST
Telangana govt releases list of public and optional holidays list for 2020

2020 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణ సెలవులతో పాటు ఐచ్చిక సెలవులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది తరహాలోనే రానున్న సంవత్సరంలోనూ పలు ప్రధాన పండగలు ఆదివారం, రెండో శనివారాలు వస్తున్నాయి. దీంతో సాధారణ సెలవుల సంఖ్య 28కి చేరగా, మొత్తంగా ఐచ్చిన సెలవులు 17ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ సంవత్సరం శనివారం లేదా సోమవారం నాడు వచ్చిన పర్వదినాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కాగా, ఒకటి లేదా రెండు రోజులు సెలవు పెట్టుకుంటే, నాలుగైదు రోజులు సెలవులు కలసివచ్చే అవకాశాలు కూడా వున్నాయి.

సాధారణ సెలవుల విషయానికి వస్తే,
* న్యూ ఇయర్ (జనవరి 1- బుధవారం)
* భోగి (జనవరి 14 - మంగళవారం)
* సంక్రాంతి (జనవరి 15 - బుధవారం)
* గణతంత్ర దినోత్సవం (జనవరి 26-ఆదివారం)
* మహా శివరాత్రి (ఫిబ్రవరి 21 - శుక్రవారం)
* హోళి (మార్చి 9 - సోమవారం)
* ఉగాది (మార్చి 25 - బుధవారం)
* శ్రీరామనవమి (ఏప్రిల్ 2- గురువారం)
* బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (ఏప్రిల్ 5-ఆదివారం)
* గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 10 - శుక్రవారం)
* అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14 - మంగళవారం)
* రంజాన్ (మే 25 - సోమవారం)
* రంజాన్ మరుసటి రోజు (మే 26 - మంగళవారం) రానున్నాయి.
* బోనాలు (జూలై 20 - సోమవారం)
* బక్రీద్ (ఆగస్టు 1 - శనివారం)
* కృష్ణాష్టమి (ఆగస్టు 11 - మంగళవారం)
* స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15 - శనివారం)
* వినాయక చవితి (ఆగస్టు 22 - శనివారం)
* మొహర్రం (ఆగస్టు 30-ఆదివారం)
* గాంధీ జయంతి (అక్టోబర్ 2 - శుక్రవారం)
* బతుకమ్మ ప్రారంభోత్సవం (అక్టోబర్ 17 - శనివారం)
* దుర్గాష్టమి (అక్టోబర్ 24 - శనివారం)
* విజయదశమి (అక్టోబర్ 25-ఆదివారం)
* మిదాడినబీ (అక్టోబర్ 30 - శుక్రవారం)
* దీపావళి (నవంబర్ 14- రెండో శనివారం)
* కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (నవంబర్ 30 - సోమవారం)
* క్రిస్మస్ (డిసెంబర్ 25 - శుక్రవారం)
* బాక్సింగ్ డే (డిసెంబర్ 26 - శనివారం)

ఐచ్ఛిక సెలవుల జాబితా ఇలా..

* హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహది (జనవరి 10 - శుక్రవారం)
* కనుమ (జనవరి 16 - గురువారం)
* శ్రీపంచమి (జనవరి 30 - గురువారం)
* పబ్ ఏ మేరాజ్ (మార్చి 23 - సోమవారం)
* మహావీర్ జయంతి (ఏప్రిల్ 6 - సోమవారం)
* సబ్ ఏ బరాత్ (ఏప్రిల్ 9 - గురువారం)
* బసవ జయంతి (ఏప్రిల్ 26- ఆదివారం)
* బుద్ధ పూర్ణిమ (మే 7 - గురువారం)
* షహదత్ హజ్రత్ అలీ (మే 14 - గురువారం)
* షబ్ ఏ ఖదర్ (మే 21 - గురువారం)
* జుమతుల్ విదా (మే 22 - శుక్రవారం)
* రథయాత్ర (జూన్ 23 - మంగళవారం)
* వరలక్ష్మీ వ్రతం (జూలై 31 - శుక్రవారం)
* రాఖీ పౌర్ణమి (ఆగస్టు 3 - సోమవారం)
* ఈద్ ఏ గధీర్ (ఆగస్టు 9- ఆదివారం)
* పార్శి కొత్త ఏడాది రోజు (ఆగస్టు 16- ఆదివారం)
* మొహర్రం (ఆగస్టు 29 - శనివారం)
* అర్బాయిన్ (అక్టోబర్ 8 - గురువారం)
* యాజ్ దుషమ్ షరీఫ్ (నవంబర్ 27 - శుక్రవారం)
* క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24 - గురువారం) 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles